Smriti Mandhana: గోల్డ్ కాస్ట్‌లో జరుగుతున్న డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆస్ట్రేలియా (INDW vs AUSW) పై చారిత్రాత్మక సెంచరీ సాధించింది. భారత మహిళల జట్టు మొదటిసారిగా డే-నైట్ మ్యాచ్ ఆడుతోంది. మంధన తన సెంచరీతో ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చింది. మంధాన కెరీర్‌లో ఇది తొలి టెస్టు సెంచరీ కూడా. మ్యాచ్ రెండో రోజున ఆమె సెంచరీ పూర్తి చేసింది. స్మృతి మంధాన కెరీర్‌లో ఇది నాలుగో టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆమె బ్యాట్ ఓ సెంచరీ సాధించింది. అంతకుముందు, ఈ ఏడాది ఇంగ్లండ్‌పై చేసిన 78 టెస్టులో మంధాన అత్యుత్తమ స్కోరుగా ఉంది.
తన కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న మంధాన 170 బంతుల్లో 100 పరుగుల మార్కును తాకింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె 18 ఫోర్లు బాదేసింది. మ్యాచ్ రెండో రోజు, భారత ఇన్నింగ్స్ 51.5 ఓవర్లలో ఆమె ఎల్లీస్ పెర్రీ వేసిన బాల్‌ను మిడ్‌వికెట్‌పై తరలించి ఫోర్ కొట్టి తన చారిత్రాత్మక సెంచరీని పూర్తి చేసింది. ఓపెనర్‌గా సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళా ప్లేయర్‌గా కూడా ఆమె నిలిచింది.
మ్యాచ్ మొదటి బంతి నుంచి మంధాన పూర్తి విశ్వాసంతో కనిపించింది. మొదటి రోజు మొదటి సెషన్‌లో ఆమె ఆస్ట్రేలియా బౌలర్లను తీవ్రంగా ఎదుర్కొంది. షెఫాలీ వర్మతో తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్య నెలకొల్పింది. కేవలం 51 బంతుల్లోనే మంధాన అర్ధ సెంచరీ పూర్తి చేసింది. ఆమె సెంచరీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నార. కానీ, వర్షం కారణంగా, ఈ నిరీక్షణ రెండో రోజుకు మారింది. మ్యాచ్ రెండో రోజున మంధాన ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకుంది. రెండవ రోజు రెండవ ఓవర్లో, ఆమె పెర్రీ బంతికి క్యాచ్ ఔట్ అయింది. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో మంధాన ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది.
విరాట్ కోహ్లీతో సమానంగా..
తన మొదటి డే-నైట్ టెస్టులో సెంచరీ సాధించిన రెండవ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకు ఎక్కింది. భారత పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌పై ఈ ఘనత సాధించాడు. 2019 సంవత్సరంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీంలు మొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ సెంచరీ సాధించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే..
టీ బ్రేక్ సమయానికి ఇండియా ఉమెన్స్ 5 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. మంధాన 127, షెఫాలి వర్మ 31, పూనం రౌత్ 36, మిథాలీ రాజ్ 30, భాటియా 19 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. క్రీజులో దీప్తి శర్మ 12, తానియా భాటియా 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫి 2 వికెట్లు, పెర్రి, గార్డెనర్ తలో వికెట్ పడగొట్టారు.
Maiden Test ton ✅
First #TeamIndia batter to score a ton in women’s Tests in Australia ✅
Drop an emoji in the comments ? & describe @mandhana_smriti‘s superb hundred. #AUSvIND
Follow the match ? https://t.co/seh1NVa8gu pic.twitter.com/aL6wu59WLl
— BCCI Women (@BCCIWomen) October 1, 2021
IPL 2021 Points Table: కొనసాగుతోన్న చెన్నై జైత్రయాత్ర.. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఎక్కడ ఉందంటే..?