BCCI: బుమ్రాను ఇక మరచిపోవాల్సిందే.. తిరిగి రాలేడు: కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఛాంపియన్ ప్లేయర్..

|

Mar 04, 2023 | 7:33 PM

జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతను IPL, ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమయ్యాడు.

BCCI: బుమ్రాను ఇక మరచిపోవాల్సిందే.. తిరిగి రాలేడు: కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఛాంపియన్ ప్లేయర్..
Jasprit Bumrah
Follow us on

భారత జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స పొందేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం బుమ్రాకు న్యూజిలాండ్‌లో శస్త్రచికిత్స జరగనుందని వార్తలు వచ్చాయి. ఈ గాయం కారణంగా బుమ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్, ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్స్‌కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. ఇటీవల, బుమ్రా గాయం అతన్ని చాలా ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో అతని కెరీర్ గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుమ్రా గురించి భారత మాజీ ఫాస్ట్ బౌలర్ మదన్ లాల్ ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టాడు.

బుమ్రా 2023లో ఎక్కువ సమయం ఖాళీగా ఉండనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ బౌలర్‌ను ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరిగే ODI ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని ప్రయత్నిస్తోంది. తద్వారా టీమిండియా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాలని చూస్తోందని వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు.

బుమ్రాను ఇక మర్చిపోండి..

ప్రతి ఒక్కరూ బుమ్రా ఫిట్‌గా ఉండాలని, దేశం కోసం ఆడాలని కోరుకుంటుంటారు. కానీ మదన్ లాల్ స్పష్టంగా బుమ్రాను మరచిపోవాలని ప్రకటించాడు. బుమ్రాకు బదులుగా ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు ఉమేష్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన మదన్ లాల్ మాట్లాడుతూ, “ఉమేష్ (WTC ఫైనల్)ని తీసుకోవచ్చు. అక్కడ భారత్‌కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అవసరం. ఒక స్పిన్నర్ ఆడే అవకాశం ఉంది. దీంతో బుమ్రాను ఇక మర్చిపోవాల్సిందే. అందుకే అతన్ని వదిలేయండి. ఎప్పుడు వస్తాడోనని చూడకుండా.. ఉన్న వారిని ఉపయోగించుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

పాత బుమ్రా దొరకడం కష్టం..

బుమ్రా తిరిగి రావడానికి సమయం పడుతుందని మదన్ లాల్ పేర్కొన్నాడు. అతను పాత బుమ్రాలా ఉంటాడనే ఆశను కూడా వదిలిపెట్టాడు. ఆయన మాట్లాడుతూ, “ఒక గాయం నయం కావడానికి మూడు నెలలు పడుతుంది. సెప్టెంబర్ నుంచి అతను క్రికెట్ ఆడలేదు. వెన్ను గాయం కారణంగా హార్దిక్ పాండ్యా కూడా నాలుగు నెలల తర్వాత తిరిగి వచ్చాడు. బుమ్రా ఆరు నెలలుగా క్రికెట్ ఆడలేదు. కాబట్టి అతను పాత బుమ్రాలా ఉంటాడని మీరు ఎలా ఆశిస్తారు. అతను కోలుకోవడానికి సమయం పడుతుంది. మీరు పాత బుమ్రాను చూడాలంటే, మీరు అతనికి సమయం ఇవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..