టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. దీనికి కారణం.. అచ్చుగుద్దినట్లుగా ఓ వ్యక్తి పాకిస్తాన్‌లో ఉండటం. అతని ఫోటో సోషల్ మీడియాలో కనిపించడంతో అది రోహిత్‌కు డూప్ అంటూ ప్రచారం మొదలైంది. వాస్తవానికి పాకిస్తాన్‌లోని రావల్పిండిలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్‌గా మారింది. ఇతను రోహిత్ శర్మను పోలి ఉండటమే ఇందుకు కారణం. అతని బాడీ లాంగ్వేజ్ కూడా అలే ఉండటం.. అతని డ్రెసింగ్ కూడా అచ్చు రోహిత్ డ్రెస్సింగ్‌ను పోలి ఉండటం చూసిన నెటిజనంతోపాటు అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు.
ఈ చిత్రాన్ని ట్వీట్ చేస్తున్నప్పుడు.. షిరాజ్ హసన్ అనే స్థానిక జర్నలిస్ట్ అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్ సురక్షితం కాదని పేర్కొనే వారిని ఎగతాళి చేశాడు. దీనితో పాటు రావల్పిండి మార్కెట్‌లో భారత వైస్ కెప్టెన్‌ను చూశానని హసన్ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ చిత్రం సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే ప్రజలు మీమ్స్ , రియాక్షన్ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు.
Who said Pakistan is not safe for visiting international cricketers?
Just saw star Indian player Rohit Sharma, enjoying a glass of Aalu Bukhara (plum) sharbat at Rawalpindi’s saddar.(Photo: Mukhtar Aziz Kansi) pic.twitter.com/GN1gG8N2jT
— Shiraz Hassan (@ShirazHassan) September 27, 2021
ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ షిరాజ్ హసన్ ఇలా వ్రాశాడు. ‘అంతర్జాతీయ క్రికెటర్‌లకు పాకిస్తాన్ సురక్షితం కాదని ఎవరు చెప్పారు? భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవల రావల్పిండిలోని సదర్‌లో ఆలూ బుఖారా (ప్లం) సిరప్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ చిత్రం తెరపైకి వచ్చిన వెంటనే, క్రికెట్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ స్పందన ఇవ్వడం ప్రారంభించారు.
Who said Pakistan is not safe for visiting international cricketers?
Just saw star Indian player Rohit Sharma, enjoying a glass of Aalu Bukhara (plum) sharbat at Rawalpindi’s saddar.(Photo: Mukhtar Aziz Kansi) pic.twitter.com/GN1gG8N2jT
— Shiraz Hassan (@ShirazHassan) September 27, 2021
Who said Pakistan is not safe for visiting international cricketers?
Just saw star Indian player Rohit Sharma, enjoying a glass of Aalu Bukhara (plum) sharbat at Rawalpindi’s saddar.(Photo: Mukhtar Aziz Kansi) pic.twitter.com/GN1gG8N2jT
— Shiraz Hassan (@ShirazHassan) September 27, 2021
Who said Pakistan is not safe for visiting international cricketers?
Just saw star Indian player Rohit Sharma, enjoying a glass of Aalu Bukhara (plum) sharbat at Rawalpindi’s saddar.(Photo: Mukhtar Aziz Kansi) pic.twitter.com/GN1gG8N2jT
— Shiraz Hassan (@ShirazHassan) September 27, 2021
He needs the sharbat. MI haar rhi h to pressure handling ke liye jaruri h?
— SR? (@orngebellpepper) September 27, 2021
ఈ చిత్రంపై వ్యాఖ్యానిస్తూ ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. ‘ఇది తక్కువ బడ్జెట్ హిట్ మ్యాన్. ‘మరో యూజర్ రాసినప్పుడు.’ ముంబై ఇండియన్స్ ఓడిపోతున్నారు.. కాబట్టి రోహిత్ శర్మ షెర్బాట్ ఒత్తిడిని నిర్వహించడానికి సిరప్ అవసరం. ‘ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇలా వ్రాశారు, ‘ఐలా! ఇది ఒక డిట్టో.
ఇవి కూడా చదవండి: Leopard Attack: చేతికర్రతో చిరుతను తరిమేసిన వృద్ధురాలు.. వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..
Bhadrachalam Temple: అసలేం జరుగుతోంది రామా.. నీ ప్రసాదం కూడా మాయం చేస్తున్నారే..