Team India: కెరీర్ చివరి వన్డేలో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. విరాట్‌తో కలిసి పాకిస్తాన్‌ తాటతీసిన భారత దిగ్గజం

|

Mar 18, 2022 | 12:10 PM

భారత క్రికెట్ జట్టులో సచిన్ టెండూల్కర్ తనదైన ముద్రవేసి ఆకట్టుకున్నాడు. గొప్ప ఆటగాడిగా పేరుగాంచి, క్రికెట్ గాడ్‌గా మారిపోయాడు. సచిన్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు, అంతకుమించి ఎంతోమంది అభిమానుల ప్రేమను పొందాడు.

Team India: కెరీర్ చివరి వన్డేలో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. విరాట్‌తో కలిసి పాకిస్తాన్‌ తాటతీసిన భారత దిగ్గజం
Sachin Tendulkar
Follow us on

భారత క్రికెట్ జట్టులో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తనదైన ముద్రవేసి ఆకట్టుకున్నాడు. గొప్ప ఆటగాడిగా పేరుగాంచి, క్రికెట్ గాడ్‌గా మారిపోయాడు. సచిన్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు, అంతకుమించి ఎంతోమంది అభిమానుల ప్రేమను పొందాడు. భారత క్రికెట్‌ను ముందుకుతీసుకెళ్లడంలో సచిన్ తనవంతు పాత్రను అద్భుతంగా పోషించాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో చివరి వన్డే 2012లో ఇదే రోజున ఆడాడు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్.. బంగ్లాదేశ్‌లోని మీర్పూర్‌లో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. అదికూడా పాకిస్థాన్‌(India vs Pakistan)తో తన చివరి మ్యాచ్ ఆడాడు. మరో విశేషం ఏంటంటే.. సచిన్ 1989 నవంబర్ 15న కరాచీలో పాకిస్థాన్‌తో తన మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడడం. తన చివరి వన్డే మ్యాచ్‌లో సచిన్ 52 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. కోహ్లి(Virat Kohli) తన బ్యాట్‌తో 22 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్‌లో పాక్ సారథి మిస్బా ఉల్ హక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించగా నాసిర్ జంషెడ్ 112 పరుగులు చేయగా, మహ్మద్ హఫీజ్ 105 పరుగులు చేయడంతో.. పాకిస్థాన్ జట్టు 6 వికెట్లకు 329 పరుగులు చేసింది. భారత్ తరపున ప్రవీణ్ కుమార్, అశోక్ దిండా తలో 2 వికెట్లు తీశారు. ఇర్ఫాన్ పఠాన్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.

కోహ్లితో కలిసి సచిన్ తీన్‌మార్ ఇన్నింగ్స్..

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభం చాలా దారుణంగా ఉంది. మహ్మద్ హఫీజ్ తొలి ఓవర్‌లోనే గౌతమ్ గంభీర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత సచిన్‌, కోహ్లి ఇన్నింగ్స్‌ను చేపట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సచిన్ ఔటైన తర్వాత విరాట్‌కు రోహిత్ శర్మ మద్దతు లభించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 83 బంతుల్లో 68 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు. పాకిస్థాన్ బౌలర్ ఉమర్ గుల్ 2 వికెట్లు పడగొట్టాడు.

టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు..

సచిన్ టెండూల్కర్ 200 టెస్టుల్లో 15921 పరుగులు, 463 వన్డేల్లో 18426 పరుగులు చేశాడు. అలాగే టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. సచిన్ ఒకేఒక T20I ఆడాడు. అందులో సచిన్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.

సచిన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న విరాట్..

సచిన్ టెండూల్కర్ టీమిండియా తరపున 200 టెస్టులు, 463 వన్డేలు ఆడాడు. 2013లో సచిన్ రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. సచిన్ రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశాడు. సచిన్ తర్వాత వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో విరాట్, సచిన్ కూడా ఉన్నారు.

1990లో తొలి టెస్టు సెంచరీ..

సచిన్ 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆగస్టు 1990లో ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్‌లో రెండో టెస్టులో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 432 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 408 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 320 పరుగులకే ఆలౌటైంది.

దీంతో భారత్ 183 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అటువంటి పరిస్థితిలో, ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన సచిన్ అజేయంగా 119 పరుగులు చేశాడు. దీంతో చివరి రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 343 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మనోజ్ ప్రభాకర్ కూడా సచిన్‌తో కలిసి అజేయంగా 67 పరుగులతో నిలిచాడు.

16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ వెస్టిండీస్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో సచిన్ 74 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: ICC Womens World Cup 2022: ఉత్కంఠ మ్యాచులో బంగ్లా తడబాటు.. అద్భుత విజయంతో భారత్‌ను వెనక్కునెట్టిన విండీస్..

Sunrisers Hyderabad, IPL 2022: కేన్ మామ కేక పుట్టించేనా.. మరోసారి హైదరాబాద్‌కు ట్రోఫీ అందించేనా?