Asia Cup 2023: రేపు శ్రీలంకకు బయల్దేరనున్న రోహిత్ సేన.. టెన్షన్ అంతా ఆయనపైనే..

|

Aug 28, 2023 | 12:00 PM

Team India leave for Sri Lanka on Aug 29: ఆసియా కప్ 2023 కోసం భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆగస్ట్ 29 మంగళవారం నాడు టీమిండియా బయలుదేరనుంది. అయితే హామ్ స్ట్రింగ్ సర్జరీ చేయించుకున్న కేఎల్ రాహుల్ 100 శాతం కోలుకోలేదు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. 100 శాతం ఫిట్‌గా ఉన్నాడు. అయితే సుదీర్ఘ 3 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలని ఉవ్విళ్లూరుతున్న రాహుల్, టోర్నీ చివరి భాగంలో భారత జట్టులో చేరవచ్చని తెలుస్తోంది.

Asia Cup 2023: రేపు శ్రీలంకకు బయల్దేరనున్న రోహిత్ సేన.. టెన్షన్ అంతా ఆయనపైనే..
Team India Asai Cup 2023
Follow us on

Asia Cup 2023: బెంగళూరులోని ఆలూర్‌లో ఆసియా కప్ 2023 కోసం భారత క్రికెట్ జట్టు కఠోర సాధన కొనసాగిస్తోంది. ఆదివారం శిబిరం నుంచి ఆటగాళ్లకు విరామం ఇచ్చినా విశ్రాంతి తీసుకోలేదు. ఎన్‌సీఏలో జరిగిన ఈ సమావేశానికి కోహ్లీ, రోహిత్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు. డెక్సా టెస్టింగ్‌లో కూడా పాల్గొన్నారు. నేడు సోమవారం, భారతదేశం ప్రత్యేక పద్ధతిలో సాధన చేస్తుంది. ఆగస్ట్ 29న మంగళవారం నాడు టీమిండియా శ్రీలంకకు బయలుదేరనుంది.

ఆసియా కప్ కోసం శ్రీలంక దేశానికి వెళ్లేందుకు భారత్ సిద్ధమైంది. అయితే హామ్ స్ట్రింగ్ సర్జరీ చేయించుకున్న కేఎల్ రాహుల్‌ ప్రస్తుతం 100% ఫిట్‌గా లేడు. అంటే 100 శాతం కోలుకోలేదు. పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి రావాల్సి ఉంది. కీపింగ్‌లో కఠోర సాధన చేసినా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేకపోయాడు. ఇప్పటికే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు. అయితే, కేఎల్ రాహుల్ మెరుగుదల పట్ల జట్టు, వైద్య విభాగం సంతృప్తిగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. 100 శాతం ఫిట్‌గా ఉన్నాడు. అయితే సుదీర్ఘ 3 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలని ఉవ్విళ్లూరుతున్న రాహుల్, టోర్నీ చివరి భాగంలో భారత జట్టులో చేరవచ్చని తెలుస్తోంది.

ఆసియా కప్ 2023 టోర్నీ..

భారత్-పాక్ మ్యాచ్‌కు రాహుల్ దూరమవుతారని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ గతంలో ప్రకటించారు. కాబట్టి అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను రంగంలోకి దింపుతారని స్పష్టం చేశారు. భారతదేశానికి సంజు శాంసన్ వంటి బ్యాకప్ ట్రావెలింగ్ రిజర్వ్‌ కూడా అందుబాటులో ఉంది. భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో భాగమైన జస్ప్రీత్ బుమ్రా, ఇతర క్రికెటర్లు సోమవారం బెంగళూరులోని ఆలూరులో కొనసాగుతున్న శిబిరంలో చేరనున్నారు.

ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ ), శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసీద్ధ్ కృష్ణ.

స్టాండ్ బై ప్లేయర్: సంజు శాంసన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..