ఓ గంభీర్ ఇది విన్నావా.. 2027 వన్డే వరల్డ్ కప్ కొట్టాలంటే ఈ నలుగురు రీఎంట్రీ ఇవ్వాల్సిందే..!

టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత జట్టు తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్. దశాబ్దాల నిరీక్షణకు తెరదించి మళ్లీ ఆధిపత్యం చాటాలంటే, పక్కనబెట్టిన నలుగురు సీనియర్ స్టార్ ఆటగాళ్లను జట్టులోకి తిరిగి తీసుకురాక తప్పదు. విశ్లేషకుల ప్రకారం ఆ నలుగురి రాక మాత్రమే టీమిండియాను తిరుగులేని ఛాంపియన్ టీంగా మారుస్తుందన్నమాట.

ఓ గంభీర్ ఇది విన్నావా.. 2027 వన్డే వరల్డ్ కప్ కొట్టాలంటే ఈ నలుగురు రీఎంట్రీ ఇవ్వాల్సిందే..!
Odi World Cup 2027

Updated on: Jul 23, 2026 | 8:52 PM

2023 వన్డే వరల్డ్ కప్‌లో గాయంతో బాధపడుతూనే కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన పేస్ బౌలర్ మహమ్మద్ షమీని ప్రస్తుతం పక్కనబెట్టడం చర్చనీయాంశమైంది. శస్త్రచికిత్స అనంతరం రీఎంట్రీ ఇచ్చిన అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదు వికెట్ల హాల్‌తో సహా 9 వికెట్లు సాధించినా, సెలెక్టర్లు పక్కనపెట్టారు. దక్షిణాఫ్రికా లాంటి విదేశీ పిచ్‌లపై వికెట్లు తీసే పక్కా బౌలర్ షమీ ఒక్కడే కాబట్టి, అతడికి 2027 ప్రణాళికల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.

హార్దిక్ పాండ్యా.. జట్టుకు అతిపెద్ద ‘ఎక్స్ ఫ్యాక్టర్’..!

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఫిట్‌నెస్ కారణాల రీత్యా వన్డే జట్టుకు దూరం చేయడం సరికాదు. అతడు పూర్తి స్థాయిలో 10 ఓవర్లు వేయకపోయినా, 5 లేదా 6 ఓవర్లు వేస్తూ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఆడే విధ్వంసకర ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. విదేశీ పరిస్థితుల్లో హార్దిక్ వంటి ఆల్‌రౌండర్ జట్టులో ఉండటం అతిపెద్ద ఆస్తి కాబట్టి, అతడిపై అనవసర నిబంధనలు పెట్టకుండా జట్టులోకి తీసుకురావాలి.

ఇది కూడా చదవండి: Video: 6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ.. మోస్ట్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

సిరాజ్ అనుభవం.. రవీంద్ర జడేజా మైండ్ సెట్!

మరోవైపు పేసర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో నూతన బౌలర్లను పదే పదే మారుస్తుండటంతో బౌలింగ్ విభాగంలో నిలకడ లోపిస్తోంది. పెద్ద టోర్నీల్లో సత్తా చాటిన సీనియర్ పేసర్ సిరాజ్ వైపే మొగ్గు చూపడం టీమిండియాకు ప్రయోజనకరం. ఇక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా పూర్తిగా పక్కనబెట్టడం ప్రమాదకరం. అక్షర్ పటేల్‌కు బ్యాకప్‌గా జడేజా జట్టులో ఉంటే, క్లిష్ట సమయాల్లో అతడి ఆల్‌రౌండ్ నైపుణ్యాలు తీవ్రంగా ఉపయోగిపడతాయి.

ఇది కూడా చదవండి: తొలి ఓవర్‌లోనే ఊహించని స్పీడ్.. అరంగేట్రంలోనే అదరగొట్టిన గుజరాత్ పేసర్..!

ఈ నలుగురు సీనియర్ ఆటగాళ్ల నైపుణ్యం, అనుభవం రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు అత్యంత కీలకం కానున్నాయి. యువ రక్తం వెనుక పరుగులు తీస్తూ ఈ ఛాంపియన్లను మర్చిపోతే, దశాబ్దాల వరల్డ్ కప్ కల మళ్లీ అసంపూర్తిగా మిగిలిపోయే ముప్పు ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us