
India Women vs South Africa Women Test: దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ తొలి రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేసింది. 113 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఆమె.. టెస్టు కెరీర్లో తొలి సెంచరీతో తనదైన ముద్ర వేసింది.
భారత్-దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మధ్య వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇప్పుడు చెన్నై వేదికగా ఒక మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు నిస్సహాయంగా కనిపించింది. టెస్టు మ్యాచ్ అయినప్పటికీ షెఫాలీ 113 బంతుల్లో సెంచరీ చేయగా, మంధాన 122 బంతుల్లోనే సెంచరీ సాధించింది.
ఈ ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వూల్వార్డ్ తన ఆరుగురు బౌలర్లను ఉపయోగించారు. కానీ, వారిలో ఎవరూ వికెట్లు తీయలేకపోయారు. వార్త రాసే సమయానికి 51 ఓవర్లు ముగిసే సరికి షఫాలీ వర్మ 139 పరుగులు చేసి క్రీజులో ఉంది. స్మృతి మంధాన 142 పరుగులతో ఉంది.
హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత మహిళల జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మూడు మ్యాచ్‌లు గెలిచి భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో స్మృతి మంధాన రెండు సెంచరీలు చేసింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు షఫాలీ, స్మృతి మంధాన అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ లంచ్‌కు ముందు తమ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి జట్టు స్కోరును వికెట్ నష్టపోకుండా 135 పరుగులకు తీసుకెళ్లారు.
లంచ్ తర్వాత కూడా ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. షఫాలీ తన అర్ధ సెంచరీని సెంచరీగా మార్చుకుంది.
షఫాలీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను 2021 సంవత్సరంలో ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుపై ప్రారంభించింది. ఆమె ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. 9 ఇన్నింగ్స్‌లలో 52.75 సగటు, 66.14 స్ట్రైక్ రేట్‌తో 426* పరుగులు చేసింది.
ఈ సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు కూడా చేసింది. ఈ మ్యాచ్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనిపించింది. ఆమె తన టెస్టు కెరీర్లో ఒక్కసారి మాత్రమే నాటౌట్‌గా నిలిచింది.
దక్షిణాఫ్రికా మహిళలు (ప్లేయింగ్ XI): లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), సునే లూస్, అన్నెకే బాష్, మారిజాన్ కాప్, డెల్మీ టక్కర్, నాడిన్ డి క్లర్క్, అన్నరీ డెర్క్సెన్, సినాలో జాఫ్తా(కీపర్), మసాబటా క్లాస్, నోంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..