సిక్సర్లు, ఫోర్ల మోత, బౌండరీ లైన్ వద్ద సూపర్బ్ క్యాచ్‌లు.. అదరగొట్టే సెంచరీలు.. పురుషుల క్రికెట్‌లో ఇవన్నీ సర్వసాధారణం. కాస్త మీరు టీవీని ట్యూన్ చేసి మహిళల క్రికెట్ మ్యాచ్‌పై ఓ లుక్కేయండి. అసలైన మజా ఏంటో తెలుస్తోంది.
కనీవినీ ఎరగని అద్భుత క్యాచ్.. ఎవ్వరూ ఊహించి ఉండరు.. బౌండరీ లైన్ వద్ద చిరుతలాగ ఎగిరి పట్టింది టీమిండియా యువ క్రికెటర్ హర్లీన్ డియోల్. అమ్మాయిల ఫిట్‌నెస్‌ను చాటిచెప్పే విధంగా ఆమె అందుకున్న క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వన్డేలు ముగిశాయి. టీ20లు జరుగుతున్నాయి. నార్తాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ అద్భుతం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఇంగ్లీష్ టీం బౌండరీలతో హోరెత్తిస్తోంది.ముఖ్యంగా అమీ జోన్స్(43)తో దూకుడు మీదుంది. వరుస బౌండరీలతో జోరు మీదుంది. ఈ తరుణంలో శిఖా పండే వేసిన 18.5 బంతికి భారీ షాట్ ఆడింది.
ఇక బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తోన్న హర్లీన్ డియోల్ అద్భుతం చేసింది. గాల్లోకి డైవ్ చేసి బంతిని అందుకుంది. అయితే ఈక్రమంలో బౌండరీ అవతల పడిపోతానని గమనించి బంతిని గాలిలోకి విసిరి మళ్లీ బౌండరీ ఇవతలికి వెళ్లి బంతిని డైవ్ చేసి మరీ అందుకుంది. హర్లీన్ సూపర్బ్ క్యాచ్‌కు సహచరులతో పాటు ఇంగ్లాండ్ మహిళల టీం కెప్టెన్ కూడా అభినందించి చప్పట్లు కొట్టింది. అలాగే హర్భజన్ సింగ్, వివిఎస్ లక్షణ్ లాంటి సీనియర్ క్రికెటర్లు సైతం హర్లీన్‌ను అభినందించారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. వర్షం అడ్డంకిగా మారడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.
Also Read:
లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!
పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!
OMG ? ??@imharleenDeol take a bow!! Calling it now the best we will see this series!! pic.twitter.com/O4Dwm4OYlU
— Lisa Sthalekar (@sthalekar93) July 9, 2021
Take a bow ?♂️ @imharleenDeol that’s simply outstanding ?? keep it up https://t.co/JdFE0PAHOI
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 9, 2021
As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH
— VVS Laxman (@VVSLaxman281) July 10, 2021