
IND vs AUS : భారత క్రికెట్ జట్టు మరోసారి తమ సత్తాను చాటింది. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌లలో తమ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ భారీ వర్షం, తుఫాను కారణంగా రద్దైంది. సిరీస్‌ను సమం చేయడానికి ఆస్ట్రేలియాకు దక్కిన ఆఖరి అవకాశం వర్షం పాలవడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాకు విజయం దక్కింది. ఈ విజయంతో భారత్, ఆస్ట్రేలియాలో వరుసగా ఐదో టీ20 సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. భారత్ ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా ఐదో టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ఈ రికార్డుతో ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌లో ఓడిపోని రికార్డును టీమిండియా కొనసాగించింది.
ఈ సిరీస్‌లో భారత్ ఒక మ్యాచ్ ఓడిపోయి వెనుకబడింది. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి అద్భుతంగా పుంజుకుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో శనివారం (నవంబర్ 8) జరిగిన చివరి మ్యాచ్ ఫలితం తేలలేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ విధ్వంసక ఆరంభాన్ని ఇచ్చారు. శుభ్‌మన్ గిల్ ఒకే ఓవర్‌లో 4 ఫోర్లు కొట్టి తన దూకుడును ప్రదర్శించాడు.
అభిషేక్ శర్మకు రెండుసార్లు లైఫ్ లైన్ లభించగా, అతను దాన్ని ఉపయోగించుకుని ధాటిగా బ్యాటింగ్ చేశాడు. టీమిండియా స్కోరు 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేయగానే తుఫాను, మెరుపులు కారణంగా ఆటను నిలిపివేశారు. దాదాపు రెండు గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. సిరీస్‌లో రద్దయిన మొదటి మ్యాచ్‌లో కూడా భారత్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడే వర్షం అంతరాయం కలిగించింది.
🚨 The 5th T20I has been called off due to rain.#TeamIndia win the series 2-1 🏆
Scorecard ▶️ https://t.co/V6p4wdCkz1#AUSvIND pic.twitter.com/g6dW5wz1Ci
— BCCI (@BCCI) November 8, 2025
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రద్దు కావడం, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలవడం, భారత్ రెండు మ్యాచ్‌లు గెలవడం వలన 2-1 తేడాతో భారత్ విజయం సాధించింది. టీమిండియా 2023 తర్వాత ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్‌లో కూడా ఓడిపోలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఈ విజయం, జట్టు భవిష్యత్తుకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..