Rohit Sharma-Virat Kohli: భారత్, వెస్టిండీస్(IND vs WI) మధ్య జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma) పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. 4 ఏళ్ల పాటు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్(Virat Kohli)ను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంతో.. ఇద్దరు ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కోహ్లీ మీడియా సమావేశంలో ఖండించినా.. వాటికి అడ్డుకట్ట పడలేదు. నేడు తొలిసారి రోహిత్ కెప్టెన్సీలో ఆడిన విరాట్ కోహ్లీ, ఎలా ఉంటాడు, రోహిత్‌తో ఎలా ముందుకు వెళ్తాడోనని అంతా భావించారు. అయితే మైదానంలో మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వీరి కెమిస్ట్రీ ఆకట్టుకోవడం విశేషం. అసలు ఇలాంటి వాళ్ల మధ్య వివాదాలు వస్తాయా అని అనుకునేంత సరదాగా కలిసిపోయారు.
రోహిత్ శర్మ స్థాయి పెరగడం వల్ల కోహ్లికి ఇబ్బంది అని పలువురు పేర్కొన్నారు. కానీ, మ్యాచ్ సమయంలో అలాంటిదేమీ కనిపించలేదు. రోహిత్ కెప్టెన్, అతను ఫీల్డింగ్ చేశాడు.కోహ్లి మైదానంలో అతనికి తెలిసిన అదే అభిరుచితో ఆడటం కనిపించింది. జట్టు కోసం సర్వస్వం ధారపోసిన విరాట్ స్ఫూర్తి మరోసారి కనిపించింది. కోహ్లి కూడా రోహిత్‌కు సహాయం చేస్తూ కనిపించాడు.
రోహిత్‌ను ఫీల్డింగ్ చేయమని సలహా కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ రివ్యూ తీసుకున్నప్పుడు, ఈ సమయంలో కూడా కోహ్లీ తన అభిప్రాయాన్ని చెప్పడం కనిపించింది.
విరాట్ రోహిత్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ..
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో విరాట్, రోహిత్ శర్మల కెమిస్ట్రీ కనిపించింది. యుజ్వేంద్ర చాహల్ పొలార్డ్‌ను బౌల్డ్ చేసిన వెంటనే, ఇద్దరూ కలిసి సంబరాలు చేసుకోవడం కనిపించింది. ఈ మ్యాచ్‌లో చాహల్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దీని తర్వాత, కోహ్లి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. 22వ ఓవర్లో విరాట్ కోహ్లి సూచన మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ తీసుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో టీమిండియా టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయింది. టెస్టు సిరీస్ ఓటమితో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. ఈ టెస్టుకు రోహిత్‌ని తదుపరి కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చని కూడా వార్తలు వచ్చాయి.
టీ20 ప్రపంచకప్ తర్వాత, కోహ్లి క్రికెట్ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అదే సమయంలో బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించింది. రోహిత్-కోహ్లీ ముఖాముఖిగా ఉన్నప్పుడు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంలోనూ మార్పులు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఇద్దరూ తమకు భారత జట్టు ముఖ్యమని చూపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
I can’t see a rift, can you?
Don’t tell me they are acting, if this was true then atleast we’ll have two nominations for the Oscars #RohithSharma#ViratKholi@mohsinaliisb pic.twitter.com/gHVc7ir755— Snehil⚡ (@callmesneh) February 6, 2022
Best moments!!!! #ViratKholi #RohithSharma #INDvWI #WIvsIND #TeamIndia pic.twitter.com/P3L5iDkXHx
— Mohammad Hayat Mir (@hayat_mir_786) February 6, 2022
Today Rohirat Pic of the day ??
Beautiful pic on internet ❤ #Rohirat #rohirat #Viratkohli #RohithSharma pic.twitter.com/5Ji9MJ1TSa— Shamsi (MSH) (@Shamsihaidri1) February 6, 2022
If u know u know?#ViratKholi #RohithSharma #WIvsIND pic.twitter.com/KZRBlgIijP
— PsychO?ヅ |LQ?| (@black_sudais_56) February 6, 2022
IND VS WI: చారిత్రాత్మక వన్డేలో టీమిండియా ఘన విజయం.. స్మార్ట్ కెప్టెన్సీతో ఆకట్టుకున్న రోహిత్..