Ind vs WI 3rd ODI: మూడో వన్డేలో 265 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. రాణించిన అయ్యర్, పంత్, దీపక్..

|

Feb 11, 2022 | 5:30 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జరుగుతున్న మూడో వన్డేలో భారత్ చేసింది...

Ind vs WI 3rd ODI: మూడో వన్డేలో 265 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. రాణించిన అయ్యర్, పంత్, దీపక్..
India
Follow us on

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జరుగుతున్న మూడో వన్డేలో భారత్ చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ కూడా వెనుదిరిగాడు. కష్టల్లో భారత్‌ను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి.

రిషబ్ బంత్ 54 బంతుల్లో 56(ఆరు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. భారత్ నిలదొక్కుకుంటున్న సమయంలో వెస్టిండీస్ బౌలర్ వాల్ష్ పంత్ ఔట్ చేశాడు. దీంతో శ్రేయస్, పంత్‌ల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యాకుమార్ యాదవ్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు.

క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపిస్తో్న్న శ్రేయస్ అయ్యర్‌ను వాల్ష్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ చాహర్ దాటిగా ఆడాడు. 38 బంతుల్లో 38(4 ఫోర్లు, 2 సిక్స్)పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు, జోసెఫ్, వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. అలెన్, స్మిత్ చేరో వికెట్ పడగొట్టారు.

Read Also.. వేలం ఎలా జరుగుతుంది.. బేస్ ప్రైజ్‌ డిసైడ్ చేసేది ఎవరు.. డబ్బంతా ప్లేయర్లకు అందుతుందా? పూర్తి వివరాలు..