
India vs West Indies: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన టీమిండియా.. ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఓ ఆటగాడు అందరి నమ్మకాన్ని వమ్ము చేశాడు. దీంతో మూడో T20 మ్యాచ్ ప్లేయింగ్ XI నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ ఆటగాడికి అవకాశం ఇవ్వడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతి పెద్ద తప్పు చేసిందంటూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. రెండో టీ20లో భారత్ ఓటమికి ఈ ఆటగాళ్లే అతిపెద్ద విలన్‌లని నిరూపించుకున్నారు. భారత్‌తో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో గెలిచి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
వెస్టిండీస్ టూర్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం కల్పించడం ద్వారా సెలెక్టర్లు పెద్ద తప్పు చేశారు. వెస్టిండీస్ పర్యటనలో, ఈ ఆటగాడు వన్డేల తర్వాత టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో తన ఫ్లాప్ ప్రదర్శనతో భారత అభిమానులను నిరాశపరుస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ 19, 24, 35 పరుగులు మాత్రమే చేశాడు. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో కూడా సూర్యకుమార్ యాదవ్ 21, 1 పరుగులు చేశాడు.
వన్డేల తర్వాత టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఫ్లాప్ పర్ఫార్మెన్స్ కారణంగా సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియాకు దోషిగా మారాడు. పేలవమైన ఫామ్ ఉన్నప్పటికీ, సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో తరచుగా అవకాశాలు ఇస్తున్నారు. యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్ ODIలు, T20 లలో విస్మరణకు గురవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఈ ఫ్లాప్ ప్రదర్శనతో రాబోయే టోర్నీల్లో స్థానం లభించదనే విషయం తేలింది. యశస్వి జైస్వాల్ భారత వన్డే, టీ20 జట్టు ప్లేయింగ్ XI లో ఎంపిక చేయడానికి బలమైన పోటీదారుగా మారాడు. యశస్వి జైస్వాల్‌కి మైదానం చుట్టూ మల్టిపుల్ షాట్లు ఆడటం, పరుగులు చేయడంలో ఆరితేరాడు. కానీ, ప్రస్తుతం ఆ లయను అందిపుచ్చుకోలేక పోతున్నాడు. యశస్వి జైస్వాల్ తుపాన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఆర్డర్‌ను కూడా నాశనం చేయగలడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..