IND vs WI: రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం..

|

Feb 18, 2022 | 11:08 PM

IND vs WI: మూడు టీ20ఐ సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో గెలుచుకుంది. రెండో వన్డేలో 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలిండగానే సొంతం చేసుకుంది.

IND vs WI: రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం..
India Vs West Indies 2ns T20i
Follow us on

IND vs WI: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (52), రిషబ్ పంత్ (52) అద్భుతమైన ఇన్నింగ్స్‌తోడు బౌలర్ల బలంతో వెస్టిండీస్ (West Indies Cricket Team) ను భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) 8 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. చివరి వరకు ఉత్కంఠగా మారిన ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. నికోలస్ పూరన్ (62), రోవ్‌మన్ పావెల్ (68 నాటౌట్) గేమ్‌ను గెలవాలని ప్రయత్నించారు. కానీ, వారిద్దరూ విండీస్‌ విజయాన్ని ఖరారు చేయలేకపోయారు.

చివరి రెండు ఓవర్లలో వెస్టిండీస్ విజయానికి 29 పరుగులు చేయాల్సి ఉంది. నికోలస్‌ పూరన్‌, పావెల్‌ వికెట్‌పై ఉంటే అది సాధ్యమేననిపించింది. భువనేశ్వర్ కుమార్ 19వ ఓవర్ మూడో బంతికి నికోలస్ పూరన్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. పూరన్ ఇచ్చిన క్యాచ్‌ను రవి బిష్ణోయ్ అద్భుతంగా పట్టుకున్నాడు. పూరన్ 41 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్‌లో వెస్టిండీస్ విజయానికి 25 పరుగులు చేయాల్సి ఉండగా అది కూడా చేయలేకపోయింది.

భారత్‌ ఇన్నింగ్స్‌..
అర్ధ సెంచరీ చేసిన తర్వాత రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో కోహ్లి అవుటయ్యాడు. అయితే, భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగుల పటిష్ట స్కోరు చేయగలిగింది. కోహ్లితో పాటు యువ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. పంత్ 28 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో ఈ బ్యాట్స్‌మెన్ ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.పంత్, కోహ్లితో పాటు వెంకటేష్ అయ్యర్ భారత్‌ను ఈ పటిష్ట స్థితికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.అయ్యర్ 18 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 పరుగులు చేశాడు. . రోహిత్ శర్మ 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని ఓపెనింగ్ భాగస్వామి ఇషాన్ కిషన్ కూడా రెండు పరుగులకు మించి రాలేకపోయాడు. ఎనిమిది పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు.

Also Read: Cricket: 77 బంతుల్లో 155 పరుగులు.. ఇద్దరు వికెట్ కీపర్ల పెను విధ్వంసం.. 6గురి బౌలర్ల ఊచకోత.!

IND vs WI 2nd T20, LIVE Score: చివరి ఓవర్‌కు వరకు ఉత్కంఠ.. 8 పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్ కైవసం..