India vs Sri lanka: శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఇండియా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈమేరకు లంక బోర్డు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియా, శ్రీలంక పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి మాథ్యూస్ ఔటైనట్లు ఎస్‌ఎల్‌సీ ప్రకటించింది. ఈమేరకు ఈ రోజు లంక బోర్డు 29 మంది ప్లేయర్లతో ఓ జాబితాను ప్రకటించింది. అయితే, అసలు 30 మందిని ప్రకటించాల్సి ఉండగా, ఏంజెలో మాథ్యూస్ తన వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు శ్రీలంక బోర్డుకు సమాచారం అందించడంతో.. ఆయన పేరును జాబితా నుంచి తొలగించారు. దీంతో భారత్‌తో జరిగే సిరస్‌కు ఆయన అందుబుటులో ఉండడని తెలిపింది. ’30 మంది స్కార్డ్ లో ఏంజెలో మాథ్యూస్ కూడా ఉన్నాడు. కానీ, తన వ్యక్తిగత కారణాలతో భారత్‌తో సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో తుది జాబితా నుంచి ఆయన్ను తొలగించామని’ ఎస్‌ఎల్‌సీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
కాగా, శ్రీలంక టీం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడారు. ఇందులో శ్రీలంక టీం ఘోరపరాజయం పాలై రెండు సిరీస్‌లను కోల్సోయింది. అయితే, ఇంగ్లండ్ టీంలో ముగ్గురు ఆటగాళ్లు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. పాకిస్తాన్ తో ఇంగ్లండ్ సిరీస్ ముందు ఆటగాళ్లకు కరోనా సోకడంతో.. ఆ జట్టు ఆందోళనలో కూరకపోయిందంట. ఇంగ్లండ్ టూర్ ముగించుకుని మంగళవారమే స్వదేశం చేరుకున్న శ్రీలంక ఆటగాళ్లు కూడా కొద్ది రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు. లంక బోర్డు జాబితా ప్రకటించడంతో ఆటగాళ్లు నేరుగా బయో బుడగలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు తమ క్వారంటైన్ పూర్తి చేసుకుని రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతున్నారు. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో బయో బుడగ నిబంధనలు పాటించకుండా.. ఇంగ్లీష్ టీంతో వన్డేలకు దూరమయ్యారు.
జులై 13 నుంచి మొదలుకానున్న భారత్, శ్రీలంక వన్డే సిరీస్ కోసం లంక ఆటగాళ్లు.. బుడగలోకి వెళ్లనున్నట్లు ఎస్‌ఎల్‌సీ ప్రకటించింది. మరోవైపు ఇంగ్లండ్ టీం కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పాకిస్తాన్ సిరీస్ కోసం 18 ఆటగాళ్లను ప్రకటించింది. అందులో ముగ్గురు ప్లేయర్లు పాజిటివ్ గా తేలడంతో.. మరలా స్వార్డ్ ను విడుదల చేసింది.
Also Read: