కొలంబో వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక అద్భుత విజయాన్ని సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంక నాలుగు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో భానుకా(36), ధనంజయ డిసిల్వా(40) రాణించారు. అటు భారత బౌలర్లలో కుల్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. రాహుల్ చాహార్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా చెరో వికెట్ తీశారు. దీనితో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసింది.
అంతకముందు టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ధావన్(40), గైక్వాడ్(21) శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే భారీ షాట్‌కు యత్నించి గైక్వాడ్ అవుట్ కావడంతో బరిలోకి దిగిన పడిక్కల్(29) కాసేపు మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. టీమ్ స్కోర్ 81 పరుగుల వద్ద కెప్టెన్ ధావన్(40)ను ధనంజయ బౌల్డ్ చేశాడు. దీనితో స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఆ తర్వాత వచ్చిన శాంసన్(7), నితీష్ రానా(9) విఫలం కాగా.. చివరిలో వచ్చిన భువనేశ్వర్ కుమార్(13) పరుగులు రాబట్టడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 132 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. కాగా, కృనాల్ పాండ్యాకు కరోనా రావడంతో అతనితో పాటు.. సన్నిహితంగా మెలిగిన ఏడుగురు(పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్, మనీష్ పాండే) ప్లేయర్స్‌ను సైతం ఐసోలేషన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
టీమిండియా: ధావన్(కెప్టెన్), గైక్వాడ్, పడిక్కల్, శాంసన్(వికెట్ కీపర్), నితీష్ రానా, భువనేశ్వర్ కుమార్, కుల్ దీప్ యాదవ్, రాహుల్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకరియా, వరుణ్ చక్రవర్తి
శ్రీలంక: అవిష్క ఫెర్నాడో, భానుకా(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, సమరవికరరామా , షనకా(కెప్టెన్), రమేష్ మెండిస్, హసరంగా, చమిక కరుణరత్నే, ఉదానా, అఖిల ధనంజయ, చమీరా
2nd T20I. It’s all over! Sri Lanka won by 4 wickets https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
INNINGS BREAK: #TeamIndia post 1⃣3⃣2⃣/5⃣ on the board after put in to bat in the 2nd #SLvIND T20I!
4⃣0⃣ for @SDhawan25
2⃣9⃣ for @devdpd072/29 for Akila Dananjaya
Sri Lanka to commence their chase soon.
Scorecard ? https://t.co/Hsbf9yWCCh pic.twitter.com/2SYLWpJgAB
— BCCI (@BCCI) July 28, 2021
కొలంబో వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక అద్భుత విజయాన్ని సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంక నాలుగు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.
2nd T20I. It’s all over! Sri Lanka won by 4 wickets https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
లంక ఐదు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు రసవత్తరంగా మారింది. క్రీజులో హసరంగా(15), ధనంజయ డిసిల్వా(18) ఉన్నారు.
10 ఓవర్లకు లంక మూడు వికెట్లు కోల్పోయింది. భానుకా(31)తో క్రీజులో ఉన్నాడు. ధనుంజయ డిసిల్వా(2) అతడికి సహకారం అందిస్తున్నాడు.
లంక బ్యాట్స్ మెన్ ఆచితూచి ఆడుతున్నారు. మొదటి వికెట్ తర్వాత మంచి బంతులను మాత్రం ఆడుతున్నారు. బౌండరీలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం సమరవికరామా(6), భానుకా(11) క్రీజులో ఉన్నారు.
లంక మొదటి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ చక్కటి బంతితో అవిష్క ఫెర్నాండోని అవుట్ చేశాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫెర్నాడో నిష్క్రమించాడు. దీనితో 12 పరుగులకు లంక మొదటి వికెట్ కోల్పోయింది.
రెండో టీ20లో టీమిండియా చతికిలబడింది. నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.
2nd T20I. 19.4: WICKET! N Rana (9) is out, c Dhananjaya de Silva b Dushmantha Chameera, 130/5 https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. శాంసన్ బౌల్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. ధనంజయ బౌలింగ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి నిష్క్రమించాడు. దీనితో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.
2nd T20I. 16.4: WICKET! S Samson (7) is out, b Akila Dananjaya, 104/4 https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. స్వీప్ చేయబోయి పడిక్కల్ బౌల్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. హసరంగా బౌలింగ్‌లో 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడిక్కల్ నిష్క్రమించాడు. దీనితో భారత్ మూడో వికెట్ కోల్పోయింది.
2nd T20I. 15.3: WICKET! D Padikkal (29) is out, b Wanindu Hasaranga, 99/3 https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. రెండు కీలక వికెట్లు పడిన తర్వాత స్కోర్ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతం క్రీజులో పడిక్కల్(25), శాంసన్(5) ఉన్నారు. 15 ఓవర్లకు 94/2 చేసింది.
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్లాగ్ స్వీప్ ఆడబోయి కెప్టెన్ ధావన్ బౌల్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. ధనంజయ బౌలింగ్‌లో40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ నిష్క్రమించాడు. దీనితో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
2nd T20I. 12.1: WICKET! S Dhawan (40) is out, b Akila Dananjaya, 81/2 https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
సగం ఓవర్లు పూర్తయ్యాయి. భారత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతోంది. మొదటి వికెట్ అనంతరం.. ధావన్ ఆచితూచి ఆడుతున్నాడు. మరో వికెట్ పడకుండా పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు. ఈ క్రమంలోనే 10 ఓవర్లకు భారత్ 61/1 చేసింది. ధావన్ 33 పరుగులు చేయగా.. పడిక్కల్ 5 పరుగులు చేశాడు.
2nd T20I. 9.3: WRT Mendis to S Dhawan (32), 4 runs, 59/1 https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
మొదటి వికెట్ కోల్పోయిన ఇండియా నిలదొక్కుకుంది. మరో వికెట్ పడకుండా కెప్టెన్ ధావన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే 7.4 ఓవర్లకు జట్టు స్కోర్ ను 50 పరుగులు దాటించాడు.
#TeamIndia bring up their 5⃣0⃣ after 7.4 overs. ? ? #SLvIND
Captain @SDhawan25 batting on 27.
Follow the match ? https://t.co/Hsbf9yWCCh pic.twitter.com/mkfaE0A94K
— BCCI (@BCCI) July 28, 2021
టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గైక్వాడ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్‌కు యత్నించి భానుకాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో భారత్ 49 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
2nd T20I. 6.6: WICKET! R Gaikwad (21) is out, c Minod Bhanuka b Dasun Shanaka, 49/1 https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
టీమిండియా ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. దీనితో ఐదు ఓవర్లకు భారత్ 38/0 చేసింది. ధావన్ 21 పరుగులు చేయగా.. గైక్వాడ్ 15 పరుగులు చేశాడు.
2nd T20I. 4.4: I Udana to S Dhawan (21), 4 runs, 38/0 https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
గైక్వాడ్, పడిక్కల్, నితీష్ రానా, చేతన్ సకరియాలకు క్యాప్ అందిస్తున్న టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్..
?Big moment for the 4⃣! ? ?
T20I caps handed over to @devdpd07, @Ruutu1331, @NitishRana_27 & @Sakariya55! ? ? #TeamIndia #SLvIND
Follow the match ? https://t.co/Hsbf9yWCCh pic.twitter.com/E4OzrlG4Sx
— BCCI (@BCCI) July 28, 2021
శ్రీలంక: అవిష్క ఫెర్నాడో, భానుకా(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, సమరవికరరామా , షనకా(కెప్టెన్), రమేష్ మెండిస్, హసరంగా, చమిక కరుణరత్నే, ఉదానా, అఖిల ధనంజయ, చమీరా
2nd T20I. Sri Lanka XI: WIA Fernando, M Bhanuka, S Samarawickrama, D de Silva, WRT Mendis, D Shanaka, W Hasaranga, C Karunaratne, I Udana, D Chameera, A Dananjaya https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021
టీమిండియా: ధావన్(కెప్టెన్), గైక్వాడ్, పడిక్కల్, శాంసన్(వికెట్ కీపర్), నితీష్ రానా, భువనేశ్వర్ కుమార్, కుల్ దీప్ యాదవ్, రాహుల్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకరియా, వరుణ్ చక్రవర్తి
Hello & Good Evening from Colombo ?
Sri Lanka have elected to bowl against #TeamIndia in the 2⃣nd #SLvIND T20I.
Follow the match ? https://t.co/Hsbf9yWCCh
Here’s India’s Playing XI ? pic.twitter.com/yqyeobUxuu
— BCCI (@BCCI) July 28, 2021
కరోనా కారణంగా భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ20 ఇవాళ్టికి వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
2nd T20I. Sri Lanka win the toss and elect to field https://t.co/Y1CoB31bO5 #SLvIND
— BCCI (@BCCI) July 28, 2021