IND vs SA 2nd Test: జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో కీలక మార్పు.. టీమిండియా ప్లేయింగ్ XIలో మరో బ్యాట్స్‌మెన్‌కు అవకాశం?

|

Jan 03, 2022 | 8:58 AM

India vs South Africa Match Preview: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ నేటి నుంచి జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. సెంచూరియన్‌ విజయం తర్వాత భారత్‌దే పైచేయిగా బరిలోకి దిగనుంది.

IND vs SA 2nd Test: జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో కీలక మార్పు.. టీమిండియా ప్లేయింగ్ XIలో మరో బ్యాట్స్‌మెన్‌కు అవకాశం?
Ind Vs Sa
Follow us on

India vs South Africa Playing XI, Match Preview: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు సిరీస్ నేటి నుంచి (జనవరి 3) ప్రారంభం కానుంది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఐదు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో భారత్‌ రెండు మ్యాచ్‌లు గెలిచి, మూడు డ్రా చేసుకుంది. రికార్డులను పరిశీలిస్తే ఇక్కడ టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. అయితే నేడు బరిలోకి దిగనున్న టీమ్ ఇండియా ప్లేయింగ్ XIలో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. పిచ్ గురించి చెప్పాలంటే, బౌలర్లు ఇక్కడ మంచి బౌన్స్ పొందుతారు.

సెంచూరియన్ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. కాబట్టి ప్లేయింగ్ XIలో ఎలాంటి మార్పుకు అవకాశం లేదు. అయితే, మార్పు జరిగితే, జట్టు మేనేజ్‌మెంట్ మరో బ్యాట్స్‌మన్‌ను చేర్చుకోవచ్చు. మైదానంలో తమ ఆటతీరుతో ఆట గమనాన్ని మార్చే సత్తా ఉన్న దక్షిణాఫ్రికా కంటే భారత్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు.

జోహన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ పిచ్, పరిస్థితి గురించి మాట్లాడితే, బౌలర్లు ఖచ్చితంగా ఇక్కడ మంచి బౌన్స్ పొందుతారు. అయినప్పటికీ, బ్యాట్స్‌మెన్‌లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. వాతావరణం గురించి మాట్లాడితే, మ్యాచ్ నాలుగు, ఐదవ రోజు వర్షం పడవచ్చు. ఇది ఆటపై కూడా ప్రభావం చూపుతుంది. రికార్డులను పరిశీలిస్తే, వాండరర్స్ దక్షిణాఫ్రికాకు మంచిది కాదు. ఇక్కడ టీమిండియా ముందు ఓడిపోయింది. ఇది కాకుండా ఇతర జట్లు కూడా దక్షిణాఫ్రికా టీంను ఓడించాయి. ఇక్కడ ఆడిన 31 టెస్టుల్లో 11 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది.

ప్లేయింగ్ XI అంచనా:
భారత్ – కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా – డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఎడిన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, వాన్ డెర్ డ్యూసెన్, టెంబా బావుమా, కైల్ వెర్నే (కీపర్), వైన్ ముల్డర్/మార్కో జెన్సన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎన్గిడి.

Also Read: Viral Video: 4 ఓవర్లు.. 3 వికెట్లు.. ఒక మెయిడిన్.. అరంగేట్రంలో అద్భుత బౌలింగ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

IND vs SA: 2 టెస్టులు.. 4 ఇన్నింగ్స్‌లు.. 77 సగటుతో 50+ రన్స్.. జోహన్నెస్‌బర్గ్‌లో కోహ్లీ కిరాక్ బ్యాటింగ్.. మరో 7 పరుగులు చేస్తే..!