IND vs SA T20 Highlights: ఉత్కంఠ పోరులో ఓడిన రోహిత్ సేన.. అగ్రస్థానం చేరిన సౌతాఫ్రికా..

|

Oct 30, 2022 | 8:15 PM

India vs South Africa, T20 world Cup 2022 Live Score Updates: దక్షిణాఫ్రికాపై మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం పెద్దగా ప్రయోజనకరంగా కనిపించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా ముందు 134 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

IND vs SA T20 Highlights: ఉత్కంఠ పోరులో ఓడిన రోహిత్ సేన.. అగ్రస్థానం చేరిన సౌతాఫ్రికా..
Ind Vs Sa T20i

దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్‌లో పెర్త్ లో టీమిండియా ఘోర పరాజయం ఎదురైంది. దీంతో రెండు వరుస విజాయాలకు బ్రేక్ పడింది. దీంతో గ్రూప్ 2లో సౌతాఫ్రికా అగ్రస్థానం చేరింది. ఇక టీమిండియా సెమీ ఫైనల్ ఆశలకు కాస్త బ్రేక్ పడింది. మర్క్రాం 52, మిల్లర్ 59 పరుగులతో సౌతాఫ్రికాకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో అర్షదీప్ 2, హార్దిక్ 1, షమీ 1, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

ఇరు జట్లు..

భారత ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(సి), రిలీ రోసోవ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి న్గిడి, అన్రిచ్ నోర్ట్జే

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 30 Oct 2022 08:06 PM (IST)

    పెర్త్ లో ఓడిన టీమిండియా..

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. మర్క్రాం 52, మిల్లర్ 59 పరుగులతో సౌతాఫ్రికాకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో అర్షదీప్ 2, హార్దిక్ 1, షమీ 1, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

  • 30 Oct 2022 07:41 PM (IST)

    IND vs SA: మర్క్రామ్ ఔట్..

    మర్క్రామ్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాక హార్దిక్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 102 పరుగులు చేసింది. మరోవైపు 32 పరుగులతో డేవిడ్ మిల్లర్ ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 30 Oct 2022 07:35 PM (IST)

    IND vs SA: మార్క్రామ్ హాఫ్ సెంచరీ..

    ఐడన్ మార్క్రామ్ కేవలం 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి, కీలక ఇన్నింగ్స్‌ తో సౌతాఫ్రికాను విజయం వైపు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. మరోవైపు 28 పరుగులతో డేవిడ్ మిల్లర్ ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 30 Oct 2022 07:28 PM (IST)

    IND vs SA: దంచికొడుతోన్న మిట్లర్, మక్రాం.. హాఫ్ సెంచరీ భాగస్వామ్యం..

    14 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. మక్రాం 43, డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరి మధ్య కీలకమైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. దీంతో సౌతాఫ్రికా విజయానికి మరో 36 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది.

  • 30 Oct 2022 07:09 PM (IST)

    IND vs SA: 10 ఓవర్లకు..

    10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. మక్రాం 23, డేవిడ్ మిల్లర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 30 Oct 2022 06:29 PM (IST)

    IND vs SA: రెండో వికెట్ డౌన్.. ఆర్షదీప్ ఆన్ ఫైర్..

    అర్షదీప్ సింగ్ రంగంలోకి దిగగానే టీమిండియాకు శుభారంభం అందించాడు. డేంజరస్ బ్యాటర్ డికాక్ (1)ను పెవిలియన్ చేర్చిన అదే ఓవర్‌లో మరో వికెట్ పడగొట్టాడు. రోస్సోను జీరో వద్దే ఔట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా టీం 2 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 7 పరుగులు చేసింది.

  • 30 Oct 2022 06:25 PM (IST)

    IND vs SA: తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    అర్షదీప్ సింగ్ రంగంలోకి దిగగానే టీమిండియాకు శుభారంభం అందించాడు. డేంజరస్ బ్యాటర్ డికాక్ ను (1) పెవిలియన్ చేర్చాడు.

  • 30 Oct 2022 06:17 PM (IST)

    సౌతాఫ్రికా టార్గెట్ 134..

    దక్షిణాఫ్రికాకు 134 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించింది. వరుసగా మూడో టాస్ గెలిచిన తర్వాత రోహిత్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అది పెద్దగా ప్రయోజనకరంగా లేదు. 8 ఓవర్లలోనే భారత్ టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్‌కు చేరింది. మొత్తం ఇన్నింగ్స్‌లో 8 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. దినేష్ కార్తీక్‌తో కలిసి సూర్యకుమార్ 50 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 11వ అర్ధశతకం నమోదు చేశాడు. సూర్య 170 స్ట్రైక్ రేట్‌తో 68 పరుగులు చేశాడు.

  • 30 Oct 2022 06:03 PM (IST)

    IND vs SA: 8వ వికెట్ డౌన్..

    18.5 ఓవర్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో సూర్య కుమార్ యాదవ్(68) మహరాజాకు క్యాచ్ ఙచ్చి పెవిలియన్ చేరాడు. 18.5 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన టీమిండియా 127 పరుగులు చేసింది.

  • 30 Oct 2022 05:54 PM (IST)

    IND vs SA: 17 ఓవర్లకు..

    17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. సూర్య 61 పరుగులు, అశ్విన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 30 Oct 2022 05:46 PM (IST)

    IND vs SA: 6వ వికెట్ డౌన్..

    టీమిండియా కీలక భాగస్వామ్యం తర్వాత మరో వికెట్‌ను కోల్పోయింది. కార్తీక్ 6 పరుగులు చేసి పార్నెల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

  • 30 Oct 2022 05:44 PM (IST)

    IND vs SA: సూర్య హాఫ్ సెంచరీ..

    వరుసగా వికెట్లు కోల్పోతూ టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరకపోయిన సమయంలో.. కార్తీక్‌తో కలిసి సూర్య కుమార్ యాదవ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కార్తీక్ 6, సూర్య 51 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 30 Oct 2022 05:27 PM (IST)

    IND vs SA: 11 ఓవర్లకు టీమిండియా..

    వరుసగా వికెట్లు కోల్పోతూ టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరకపోతోంది. ఈ క్రమంలో 11 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కార్తీక్ 2, సూర్య 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 30 Oct 2022 05:15 PM (IST)

    IND vs SA: 5వ వికెట్ డౌన్..

    వరుసగా వికెట్లు కోల్పోతూ టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరకపోయింది. హార్దిక్ పాండ్యా (2) 5వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 8.3 ఓవర్‌లో ఎంగిడి బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 9 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.

  • 30 Oct 2022 05:08 PM (IST)

    IND vs SA: 4వ వికెట్ డౌన్..

    దీపక్ హుడా (0) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 7.3 ఓవర్‌లో నోర్త్జే బౌలింగ్‌లో డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 7.3 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది.

  • 30 Oct 2022 05:04 PM (IST)

    IND vs SA: మూడో వికెట్ డౌన్..

    విరాట్ కోహ్లీ(12) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 6.5 ఓవర్‌లో ఎంగిడి బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది.

  • 30 Oct 2022 04:57 PM (IST)

    IND vs SA: కేఎల్ ఔట్..

    టీ20 ప్రపంచ కప్‌లో ఫాంలో లేని కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశ పరచగా, మూడో మ్యాచ్(9)లోనూ సత్తా చాటలేకపోయాడు. నోర్ట్జే బౌలింగ్‌లో మక్రాంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 4.6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.

  • 30 Oct 2022 04:52 PM (IST)

    IND vs SA: రోహిత్ ఔట్..

    బౌండరీలతో దూకుడు మీదున్న రోహిత్ శర్మ (15 పరుగులు, 1 పోర్, 1 సిక్స్) మరో భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఎంగిడి బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 4.2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది.

  • 30 Oct 2022 04:45 PM (IST)

    IND vs SA: 3 ఓవర్లకు టీమిండియా..

    3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 14 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 7, రోహిత్ శర్మ 7 పరుగులు చేశారు. ఈ ఇద్దరూ సిక్సర్లతో తమ పరుగుల ఖాతాలను తెరిచారు.

  • 30 Oct 2022 04:32 PM (IST)

    మొదలైన టీమిండియా బ్యాటింగ్..

    టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు.

  • 30 Oct 2022 04:10 PM (IST)

    సౌతాఫ్రికాలోనూ ఒక మార్పు..

    దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(సి), రిలీ రోసోవ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి న్గిడి, అన్రిచ్ నోర్ట్జే

  • 30 Oct 2022 04:09 PM (IST)

    టీమిండియాలో ఒక మార్పు..

    భారత ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

  • 30 Oct 2022 04:08 PM (IST)

    టాస్ గెలిచిన టీమిండియా..

    టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేయనుంది. కాగా, టీమిండియాలో ఒక మార్పు వచ్చింది. అక్షర్ తప్పుకోగా, దీపక్ హుడా చేరాడు.

  • 30 Oct 2022 03:29 PM (IST)

    వరుస విజయాలతో టీమిండియా..

    ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లోకేష్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ నిరాశ పరిచినా.. విరాట్‌ కోహ్లి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆపై నెదర్లాండ్స్‌పై రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. విరాట్‌తో పాటు సూర్య, రోహిత్ కూడా అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్, భువనేశ్వర్‌లతో పాటు షమీ కూడా లయలో ఉన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించింది.

  • 30 Oct 2022 03:08 PM (IST)

    సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిపత్యం..

    2014 తర్వాత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. 2009 ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు.

  • 30 Oct 2022 03:06 PM (IST)

    పెర్త్‌లో రెండు మ్యాచ్‌లు

    ఆదివారం పెర్త్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరుగుతోంది. ఆ తర్వాత ఇదే పిచ్‌పై భారత్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ జరగనుంది. ఈ వికెట్‌పై తేలికపాటి గడ్డి కూడా ఉంది. ఇది ఫాస్ట్ బౌలర్లకు మేలు చేస్తుంది.

Follow us on