India vs South Africa, ICC world Cup 2023 Highlights: టీమిండియా బౌలర్లు మరోసారి విజృంభించారు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ బౌలర్లను వణికిస్తోన్న సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 327 పరుగులకు ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను కేవలం 83 పరుగులకే కుప్ప కూల్చారు. ఫలితంగా 243 పరుగుల ఘన విజయాన్ని టీమిండియాకు అందించారు. ప్రపంచ కప్ 2023లో ఈరోజు గొప్ప రోజు. దీనికి కారణం ఒకటి కాదు రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం విరాట్ కోహ్లీ పుట్టినరోజు కాగా, రెండో కారణం ఈ ప్రత్యేక రోజున భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ కావడం రెండో కారణం. అంటే, ఇప్పటివరకు టోర్నీలో అత్యంత పటిష్టంగా కనిపించిన రెండు జట్లు ఈ రోజు తలపడుతున్నాయి. ఒక టీం బ్యాట్స్‌మెన్ సంచలనం సృష్టిస్తోండగా, మరొక జట్టు బౌలర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. అంటే, నేటి మ్యాచ్ కూడా దక్షిణాఫ్రికా బ్యాటింగ్, భారత్ బౌలింగ్ మధ్య పోరుగా పేర్కొంటున్నారు.
టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ చేయనుంది.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
టీమిండియా బౌలర్లు మరోసారి విజృంభించారు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ బౌలర్లను వణికిస్తోన్న సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 83 పరుగులకే ఆ జట్టును కూల్చారు. ఫలితంగా 243 పరుగుల ఘన విజయాన్ని టీమిండియాకు అందించారు.
రవీంద్ర జడేజా స్పిన్ కు దక్షిణాఫ్రికా బ్యాటర్లు దాసోహమంటున్నారు. వరుసగా వికెట్లు కోల్పోతున్నారు. ఇప్పటికే జడేజా ధాటికి 6 వికెట్లు కోల్పోయింది ప్రొటీస్ జట్టు. జడేజా మొత్తం 5 ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు 18 ఓవర్లు ముగిసే సరికి 66/6
బ్రేకుల్లేని బండిలా మహ్మద్ షమీ దూసుకెళుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడీ సీనియర్ పేసర్. 13 ఓవర్ లో రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాకు భారీ ధమ్కీ ఇచ్చాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 42 రన్స్. షమీ, జడేజా తలా రెండు వికెట్లు తీశారు.
భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడుతోంది. ఇప్పటికే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డికాక్, బవుమాతో పాటు స్టార్ బ్యాటర్ మర్ క్రమ్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు స్కోరు 13 ఓవర్లు ముగిసే సరికి 40/3/. సిరాజ్, షమీ, జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.
327 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు భారీ షాక్ ఇచ్చాడు మహ్మద్ సిరాజ్. తన మొదటి ఓవర్లోనే ఇన్ ఫామ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ను బౌల్డ్ చేశాడు. 3.2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోరు 10/1
కోల్ కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ సెంచరీతో మెరవగా, శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో రాణించాడు.
విరాట్ కోహ్లీ తన పుట్టిన రోజును మరుపురాని జ్ఞాపకంగా మార్చుకున్నాడు. వన్డేల్లో 49వ సెంచరీని నమోదు చేసి క్రికెట్ గాడ్ సచిన సరసన నిలిచాడు. మొత్తం 119 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీని అందుకున్నాడు కింగ్.
సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 41 ఓవర్లు ముగిసే సరికి 241/3. క్రీజులో కోహ్లీ (77), రాహుల్ (7) ఉన్నారు.
గత మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించిన శ్రేయస్ అయ్యార్ ఈ మ్యాచులోనూ దుకుడుగా ఆడుతున్నాడు. ఇప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న ఈ యంగ్ ప్లేయర్ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 34.2 ఓవర్లకు 218/2. క్రీజులో కోహ్లీ (57), శ్రేయస్ (70) ఉన్నారు.
బర్త్ డే బాయ్ కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టు స్కోరు 30 ఓవర్లు ముగిసే సరికి 179/2. క్రీజులో కోహ్లీ (74 బంతుల్లో 50), శ్రేయస్ అయ్యర్ (47) పరుగులతో ఆడుతున్నారు.
విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. దీంతో భారత్ 25 ఓవర్లకే 150 పరుగులు చేసింది. అయితే సౌతాఫ్రికా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో కోహ్లీ, అయ్యర్ ఆచి తూచి ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 27 ఓవర్లకు 156 పరుగులు. కోహ్లీ (48) అర్ధసెంచరీకి చేరువలో ఉన్నాడు.
భారత్ స్కోరు వంద పరుగులు దాటింది. ఓపెనర్లు, కోహ్లీ ధాటిగా ఆడడంతో 13.1 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ ను అందుకుంది. ప్రస్తుతం భారత్ స్కోరు 15.2 ఓవర్లు ముగిసే సరికి 106/2. కోహ్లీ (25), శ్రేయస్ అయ్యర్ (7) క్రీజులో ఉన్నారు.
భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న శుభ్ మన్ గిల్ (24 బంతుల్లో 23) కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 11 ఓవర్లు ముగిసే సరికి 94/2. క్రీజులో కోహ్లీ (19), శ్రేయస్ అయ్యర్ (0) ఉన్నారు.
దూకుడు కొనసాగించడంలో రోహిత్ శర్మ (24 బంతుల్లో 40) మళ్లీ విఫలమయ్యాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించిన హిట్ మ్యాన్ రబాడా బౌలింగ్ లో బవుమా చేతికి చిక్కాడు. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ స్కోరు 55/1.
ప్రపంచకప్ లో టాప్ మోస్ట్ వికెట్లతో దూసుకెళుతోన్న మార్కొ జాన్సెన్ భారత్ తో మ్యాచ్ లో తడబడ్డాడు. మొదటి ఓవర్ లోనే ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 4 వైడ్లు ఉండడం విశేషం. ఇక భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి 35 పరుగులు చేసింది. రోహిత్ (15), గిల్ (12) ధాటిగా ఆడుతున్నారు.
టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా గిల్‌తోపాటు బ్యాటింగ్‌కు దిగాడు.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ చేయనుంది.
కీలక మ్యాచ్‌లో తలపడేందుకు భారత్, సౌతాఫ్రికా టీంలు ఈడెన్ గార్డెన్ చేరుకున్నాయి. తుది కసరత్తులు చేస్తున్నాయి.
విరాట్ కోహ్లికి గోల్డెన్ బ్యాట్ దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ గోల్డెన్ బ్యాట్‌ని CAB అంటే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కోహ్లీ 35వ పుట్టినరోజున అతనికి బహుకరిస్తుంది.
విరాట్ కోహ్లి 35వ పుట్టిన రోజు సందర్భంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగడం చాలా ప్రత్యేకం. విరాట్ తన పుట్టినరోజున మూడో మ్యాచ్ ఆడనున్నాడు. ఇంతకు ముందు అతను ఒక టెస్టు, ఒక టీ20 ఆడాడు. అంటే, అతను తన పుట్టినరోజున మొదటిసారి వన్డే మ్యాచ్‌ను కూడా ఆడబోతున్నాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ 1.30 గంటలకు ఉంటుంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత జట్టు అజేయంగా ఉంది. దక్షిణాఫ్రికా జట్టు ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడింది.