
ప్రస్తుతం శ్రీలంకలో ఆసియా కప్ జరుగుతోంది(Asia Cup 2023) సూపర్-4 రౌండ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సెప్టెంబర్ 10న మ్యాచ్ జరగనుండగా, ఆ రోజు కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదించింది. అందుకే లీగ్ స్థాయిలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రద్దయినట్లే.. సూపర్ 4 స్థాయి మ్యాచ్ కూడా రద్దవుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, అభిమానులకు ఓ శుభవార్త అందించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ).. ఈ రెండు జట్ల మధ్య హైవోల్టేజీ పోరుకు రిజర్వ్ డే ఉంచాలని నిర్ణయించింది. మీడియా కథనాల ప్రకారం, సెప్టెంబర్ 10న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 11న మ్యాచ్‌ను కొనసాగించనున్నారు. సూపర్-4లో ఈ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంచారని, ఆసియా కప్ ఫైనల్‌కు కూడా రిజర్వ్ డేని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది.
ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ లీగ్ రౌండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ చేసింది. అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించే ముందు భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. పల్లెకెలెలో ఈ మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత టీమిండియా తదుపరి మ్యాచ్‌కు వర్షం ఇబ్బంది పెట్టడంతో.. డీఎల్‌ఎస్ పద్ధతిలో టీమిండియా నేపాల్ జట్టును ఓడించి సూపర్-4లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు సూపర్-4 రౌండ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను వర్షం నీడ కప్పేసింది. దీంతో అభిమానులకు మళ్లీ నిరాశ కలగకుండా ఉండేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డేను షెడ్యూల్ చేసిందంట.
Asia Cup 2023 | Asian Cricket Council says, "A reserve day has been incorporated for the Super11 Asia Cup 2023 Super 4 match between India vs Pakistan scheduled to take place on 10th September 2023 at R. Premadasa International Cricket Stadium in Colombo. If adverse weather… pic.twitter.com/gTEu7DnkuR
— ANI (@ANI) September 8, 2023
ఆసియా కప్‌లో ఇది హై-వోల్టేజ్ పోరుగా మారినందున ACC భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం రోజును రిజర్వ్ చేసిందని తెలుస్తోంది. అయితే, మిగతా జట్ల సంగతేంటి? అనే కొత్త చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కూడా సూపర్-4 దశకు చేరుకున్నాయి. ఈ జట్లు సెప్టెంబర్ 9న కొలంబోలో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ మ్యాచ్‌కు ఎలాంటి రిజర్వ్ డేని నిర్ణయించలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు జట్ల క్రికెట్ సంస్థలు ఈ విషయంపై ACC ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..