IND Vs NZ, WTC Final 2021 Day 1 Highlights: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు షాక్.. తొలి రోజు వర్షార్పణం..

|

Jun 18, 2021 | 7:58 PM

India vs New Zealand : క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం..

IND Vs NZ, WTC Final 2021 Day 1 Highlights: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు షాక్.. తొలి రోజు వర్షార్పణం..
Kohli Vs Williamson

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన డబ్ల్యూటీసీ ఫైనల్ సమరానికి ఆదిలోనే షాక్ తగిలింది. తొలిరోజు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీనితో టాస్ పడకుండానే తొలిరోజు ఆట వర్షార్పణం అయింది. వర్షం భారీగా కురవడంతో సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్‌ బౌల్ మైదానం పూర్తిగా నీటిమాయమైంది. మ్యాచ్ అంపైర్లు, రిఫరీలు పలుమార్లు పరిశీలించి.. గ్రౌండ్‌లో ఈరోజు మ్యాచ్ కుదరదని తేల్చేశారు. వరుణుడు కనికరిస్తే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆట ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు జూన్ 23వ తేదీ రిజర్వ్ డేగా ఉంది.

టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ

న్యూజిలాండ్(అంచనా): – కాన్‌వే, లాథమ్, విలియమ్సన్, టేలర్, నికోలస్, జమీసన్, వాటలింగ్, సౌధి, బౌల్ట్, వేగ్నర్

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jun 2021 07:56 PM (IST)

    డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఫన్నీ మీమ్స్‌.. సోషల్ మీడియాలో హల్చల్..

    డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలిరోజు ఆటకు వర్షం అడ్డుపడింది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఈ మ్యాచ్‌.. వరుణుడి రాకతో ఆగిపోవడంతో అసహనానికి గురవుతున్నారు. వర్షమా కాస్త జాలీ చూపమ్మా అంటూ వేడుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసి నవ్విస్తున్నారు. ఇందులో రైన్ రైన్‌ గో ఎవే పాటను మార్చి ” రైన్ రైన్ గో ఎవే.. కమ్ ఎగైన్ ఆప్టర్ 22.. ఇండియా వాంట్స్‌ టూ ప్లే.. రైన్ రైన్ గో ఎవే” అంటూ సృజనాత్మకతకు పదునుపెట్టాడు.

  • 18 Jun 2021 07:10 PM (IST)

    రాత్రి 7.30 గంటలకు పిచ్‌ను పరిశీలించనున్న అంపైర్లు..

    సౌతాంప్టన్‌లో గంట నుంచి వర్షం పడట్లేదు. ప్రస్తుతం, మ్యాచ్ అంపైర్లు మైఖేల్ గోఫ్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ మైదానాన్ని పరిశీలించారు. మరోసారి రాత్రి 7.30 గంటలకు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.

  • 18 Jun 2021 07:07 PM (IST)

    సౌతాంప్టన్‌లో ఆగిన వర్షం..

    ప్రస్తుతం సౌతాంప్టన్‌లో వర్షం ఆగిపోయింది. స్టేడియం నుంచి నీటిని సిబ్బంది తోడుతున్నారు. అంపైర్లు పిచ్ పరిశీలించాక ఆట ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

  • 18 Jun 2021 07:06 PM (IST)

    సౌతాంప్టన్‌లో ఆగని వర్షం..

    సౌతాంప్టన్‌లో వర్షం ఆగలేదు. అటు న్యూజిలాండ్, ఇటు ఇండియా అభిమానులు వర్షం ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూస్తున్నారు.

  • 18 Jun 2021 05:49 PM (IST)

    డబ్ల్యూటీసీ ఫైనల్: లంచ్ బ్రేక్

    సౌతాంప్టన్‌లో వర్షం ఆగలేదు. ఇప్పటికే తొలి సెషన్ రద్దు కాగా.. రెండో సెషన్‌ జరగడంపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. రెండో సెషన్‌లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని ఆ దేశ వాతావరణ శాఖ తెలియజేయడంతో ఈరోజు మ్యాచ్ జరిగే అవకాశం దాదాపుగా కనిపించట్లేదు. అటు ఇరు జట్ల అభిమానులు కూడా వర్షం తగ్గాలని ప్రార్ధిస్తున్నారు.

  • 18 Jun 2021 03:54 PM (IST)

    టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతకు రూ. 11.72 కోట్లు..

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత రూ. 11.72 కోట్ల ప్రైజ్ మనీని అందుకోబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 5.85 కోట్ల ప్రైజ్‌ మనీ లభిస్తుందని పేర్కొంది. ఏదైనా కారణం చేత మ్యాచ్‌ డ్రాగా ముగిసినట్లైతే, ప్రైజ్‌ మనీని ఇరు జట్లకు సమంగా పంచనున్నట్లు ఐసీసీ వివరించింది.

  • 18 Jun 2021 03:48 PM (IST)

    డబ్ల్యూటీసీ ఫైనల్: వ్యూహలపై న్యూజిలాండ్ ప్లేయర్స్ చర్చ..

    సౌతాంప్టన్‌లో జోరుగా వర్షం కురుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితేనేం న్యూజిలాండ్ ప్లేయర్స్ మాత్రం.. మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలు రచించాలన్న దానిపై చర్చ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటోను క్రికెట్ న్యూజిలాండ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

  • 18 Jun 2021 03:40 PM (IST)

    సౌతాంఫ్టన్‌లో జోరుగా కురుస్తున్న వర్షం.. చిత్తడిగా మారిన స్టేడియం..

    డబ్ల్యూటీసీ మ్యాచ్ జరగాల్సిన సౌతాంఫ్టన్‌లో వర్షం జోరుగా కురుస్తోంది. దీనితో గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారింది. ఎడతెరిపిలేని వర్షంతో స్టేడియం నీటితో నిండిపోయింది. ఆ విజువల్స్ మీరే చూడండి..

  • 18 Jun 2021 03:32 PM (IST)

    డబ్ల్యూటీసీ ఫైనల్: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..

    డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా సీనియర్ ప్లేయర్స్‌పై భారం వేశాడు. ఇద్దరు యువ ఆటగాళ్లను మినహాయించి.. ఇంగ్లాండ్ పిచ్‌పై అనుభవం ఉన్న సీనియర్లనే ఎంపిక చేశాడు. జట్టులో శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ యంగ్ ప్లేయర్స్ కాగా, మిగిలిన వాళ్లందరూ సీనియర్లు.

    టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ

  • 18 Jun 2021 03:28 PM (IST)

    డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు షాక్..

    ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకిగా మారింది. మ్యాచ్ జరగాల్సిన సౌతాంప్టన్‌లో జోరుగా వర్షం కురుస్తోంది. ఏజెస్ బౌల్ స్టేడియం చిత్తడిగా మారడంతో తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీనితో టాస్ పడకుండానే మొదటి సెషన్ రద్దైంది. వరుణుడు కనికరిస్తే.. రెండో సెషన్ నుంచి ఆట ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • 18 Jun 2021 03:08 PM (IST)

    డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకి..

    డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. మ్యాచ్ జరగాల్సిన సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈ మ్యాచ్‌కు జూన్ 23 రిజర్వ్ డేగా ఉంచారు.

  • 18 Jun 2021 03:05 PM (IST)

    బిగ్ డే: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రంగం సిద్దం.. అమీతుమీ తేల్చుకోనున్న భారత్, న్యూజిలాండ్..

    సౌతాంప్టన్ వేదిక సిద్దమైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అగ్రస్థానంలో నిలిచి కోహ్లీసేన ఫైనల్స్‌కు చేరగా.. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ గెలుపుతో  ట్రోఫీ లక్ష్యంగా న్యూజిలాండ్ బరిలోకి దిగింది.

Follow us on