IND vs NZ 2nd ODI: రోహిత్ శర్మను కలవరపెట్టిన బ్రేస్‌వెల్ ఇన్నింగ్స్.. దెబ్బకు రెండో వన్డే నుంచి ఆ స్టార్ బౌలర్ ఔట్..

India vs New Zealand 2nd ODI: న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం లభించడం కష్టమే. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని తన కోటా మొత్తం బౌల్ చేయించలేకపోయాడు.

IND vs NZ 2nd ODI: రోహిత్ శర్మను కలవరపెట్టిన బ్రేస్‌వెల్ ఇన్నింగ్స్.. దెబ్బకు రెండో వన్డే నుంచి ఆ స్టార్ బౌలర్ ఔట్..
Team India

Updated on: Jan 21, 2023 | 8:30 AM

India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 21న రాయ్‌పూర్‌లో జరగనుంది. కివీస్‌కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. న్యూజిలాండ్ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. తొలి వన్డేలో విజయం సాధించిన తర్వాత కూడా భారత్‌ ఊపిరి పీల్చుకోలేకపోయిందన్నది నిజం. ఎందుకంటే కివీస్ బ్యాట్స్‌మెన్ మైకేల్ బ్రేస్‌వెల్ భారత బౌలర్లపై విరుచుకుపడిన తీరు.. టీమ్ ఇండియా బౌలింగ్ లోపాలను బట్టబయలైంది. బ్రేస్‌వెల్ కంటే ముందు బౌలర్లందరూ ఖరీదైన వారుగా తేలిపోయారు. అతని బ్యాటింగ్ తీరు చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ కోటా మొత్తం ఓవర్లు బౌల్ చేయించలేకపోయాడు. దీంతో రెండో వన్డే ఆడే ఎలెవన్‌ నుంచి కుల్‌దీప్‌ని తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఓవర్ పూర్తి చేయకపోవడానికి అసలు కారణం..

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాలుగో బౌలింగ్ మార్పులో కుల్దీప్ యాదవ్‌కు బంతిని అందించాడు. కివీస్ జట్టులో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ సమయంలో అతని బంతిపై కొన్ని భారీ షాట్లు కూడా వచ్చాయి. కానీ, కుల్దీప్‌ను బౌలింగ్ చేయకుండా ఆపినప్పుడు, అతను 8 ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి 43 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ కోటా నెరవేరకపోవడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే కుల్దీప్‌ను బౌలింగ్‌లోకి తీసుకురావాలనుకున్నప్పుడు, మైఖేల్ బ్రేస్‌వెల్ తన పూర్తి ఫాంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్లందరిపైనా భీకరంగా విరుచుకుపడ్డాడు. బ్రేస్‌వెల్ ఎడమ చేతి బ్యాటర్. కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ కూడా. ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్రేస్‌వెల్‌ ముందు కుల్‌దీప్‌ ఖరీదుగా నిరూపించుకునే అవకాశం ఉందనే ఆలోచనలో కెప్టెన్‌ ఉన్నాడు. బహుశా అందుకే రోహిత్ శర్మ కుల్దీప్‌తో బౌలింగ్ చేయడం సరైనదని కాదని భావించాడు.

బ్రేస్‌వెల్ సత్తా చాటితే.. బౌలర్లకు కష్టాలే..

న్యూజిలాండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మైకేల్ బ్రేస్‌వెల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం అతనికి లేకపోయినా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత, అతను దూకుడు బ్యాట్స్‌మెన్‌గా తన ఇమేజ్‌ని పెంచుకున్నాడు. అతను ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ రెండు సెంచరీలు సాధించాడు. ఇంతకుముందు, ఎంఎస్ ధోని మాత్రమే ఏడో నంబర్‌లో ఆడుతూ రెండు సెంచరీలు సాధించిన లిస్టులో ఉన్నాడు. ఇప్పుడు బ్రేస్‌వెల్ ధోనీని సమం చేశాడు. రాయ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌లో బ్రేస్‌వెల్ మరోసారి తన సత్తా చాటితే.. టీమిండియా బౌలర్ల కష్టాలు మరింత పెరిగినట్లే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..