Ind Vs Nz: నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 .. ఇండియా‎ను కలవరపెడుతున్న మిడిలార్డర్ వైఫల్యం..

|

Nov 19, 2021 | 7:03 AM

భారత్, న్యూజిలాండ్‎ మూడు టీ20 మ్యాచ్‎ల సిరీస్‎లో భాగంగా శుక్రవారం రాంచీలో రెండో మ్యాచ్ జరగనుంది. కోచ్‎గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్, టీ20 కెప్టెన్‎గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‎‎లోనే విజయం సాధించారు. రెండో మ్యాచ్‎లో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు...

Ind Vs Nz: నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 .. ఇండియా‎ను కలవరపెడుతున్న మిడిలార్డర్ వైఫల్యం..
India Vs New Zealand
Follow us on

భారత్, న్యూజిలాండ్‎ మూడు టీ20 మ్యాచ్‎ల సిరీస్‎లో భాగంగా శుక్రవారం రాంచీలో రెండో మ్యాచ్ జరగనుంది. కోచ్‎గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్, టీ20 కెప్టెన్‎గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‎‎లోనే విజయం సాధించారు. రెండో మ్యాచ్‎లో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇండియా1-0తో లీడ్‎లో ఉంది. జైపూర్‎లో జరిగిన మ్యాచ్‎లో ఇండియా గెలిచినప్పటికీ జట్టులో కొన్ని లోపాలు కనిపించాయి. మొదటి మ్యాచ్‎లో భువనేశ్వర్, అశ్విన్ మినహా మిగతా వారు బౌలింగ్‎లో విఫలమయ్యారు. సిరాజ్, దీపక్ చాహర్ భారీగా పరుగులిచ్చారు. భువనేశ్వర్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గాయపడిన సిరాజ్ స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది.

ఇక బ్యాటింగ్ విషయానికొస్తే మొదటి మ్యాచ్‎లో కేఎల్ రాహుల్ విఫలమయ్యారు. కేవలం 15 పరుగులే చేశాడు. టీంఇండియాను మిడిలార్డర్ విఫలమవడం కలవరపెడుతుంది. మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ ఆకట్టుకున్నాడు. 42 బంతుల్లో 62 పరుగులు చేశాడు. శ్రేయస్స్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ తక్కువ పరుగులకే ఔటయ్యారు. రిషభ్ పంత్ 17 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. సుదీర్ఘ విరామం తర్వాత భారత్ తరఫున మ్యాచ్ ఆడుతున్న శ్రేయాస్ బంతిని కొట్టడంలో ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. పెద్ద షాట్లు రానప్పుడు సింగిల్స్, టూడిలతో స్ట్రైక్‌లో రోటేట్ చేయడంపై అతను పెద్దగా ఆసక్తి చూపలేదు.

టిమ్ సౌథీ నేతృత్వంలోని న్యూజిలాండ్ గెలుపు కోసం ప్రణాళికలు వేస్తోంది. కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ మంచి ఫామ్‎లో ఉన్నాడు. జైపూర్ మ్యాచ్‎లో అతడు 70 పరుగలు చేశాడు. బౌలింగ్‎లో న్యూజిలాండ్ బలంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌పై నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ నిర్వహణపై జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌ను వాయిదా వేయాలని లేదా స్టేడియంలో సగం సామర్థ్యంతో మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Read Also.. రికీ పాంటింగ్‌ ఇండియా కోచ్‌ ఆఫర్‌ వద్దనడానికి కారణం చెప్పాడు.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..