IND vs NZ 2nd ODI: టాస్ గెలిచిన భారత్.. వరుసగా 7వ సిరీస్ విజయంపై కన్నేసిన రోహిత్.. ప్లేయింగ్ 11 ఇదే..

|

Jan 21, 2023 | 1:09 PM

భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో భాగంగా నేడు రాయ్‌పూర్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ టీం బ్యాటింగ్ చేయనుంది.

IND vs NZ 2nd ODI: టాస్ గెలిచిన భారత్.. వరుసగా 7వ సిరీస్ విజయంపై కన్నేసిన రోహిత్.. ప్లేయింగ్ 11 ఇదే..
Ind Vs Nz Playing 11
Follow us on

IND vs NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో భాగంగా నేడు రాయ్‌పూర్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ టీం బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ బరిలోకి దిగనుండగా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోవాలని కివీస్ జట్టు భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే స్వదేశంలో వరుసగా 7వ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. గత నాలుగేళ్లుగా స్వదేశంలో వన్డే సిరీస్‌ను కోల్పోలేదు. అంతకుముందు 2019లో ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-2తో ఓడింది. 2010 నుంచి భారత జట్టు స్వదేశంలో 25 వన్డేల సిరీస్‌లు ఆడింది. ఇందులో 23 సార్లు గెలిచి కేవలం 2 సార్లు మాత్రమే ఓటమి చవిచూసింది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు:

టీమిండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..