IND vs NZ: నాలుగేళ్ల కష్టం.. గాయాలు బాధించినా వెనక్కి తగ్గలే.. టెస్ట్ క్రికెటర్ నంబర్ 303‌గా బరిలోకి దిగనున్న ప్లేయర్ ఎవరో తెలుసా?

|

Nov 25, 2021 | 7:35 AM

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ భారత టెస్టు చరిత్రలో 303వ నంబర్ ఆటగాడిగా టెస్టు బరిలోకి దిగనున్నాడు. 2017లో పరిమిత ఓవర్లలో తన కెరీర్ ఆరంభించాడు. అయితే టెస్టు క్రికెటర్ కల నెరవేరేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది.

IND vs NZ: నాలుగేళ్ల కష్టం.. గాయాలు బాధించినా వెనక్కి తగ్గలే.. టెస్ట్ క్రికెటర్ నంబర్ 303‌గా బరిలోకి దిగనున్న ప్లేయర్ ఎవరో తెలుసా?
India Vs New Zealand 1st Test, Shreyas Iyer
Follow us on

India Vs New Zealand, 1st Test: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టుకు ముందు అజింక్య రహానే బుధవారం మీడియాతో మాట్లాడాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గురువారం నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. విరాట్, రోహిత్, పంత్ వంటి ఆటగాళ్ల గైర్హాజరీపై రహానెను విలేకరులు ప్రశ్నించారు. ఈ ఆటగాళ్ల లోటు కచ్చితంగా కనిపిస్తోంది. అయితే కొత్త ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం అని పేర్కొన్నాడు. రహానే ఫాంపై మాట్లాడుతూ, ‘నేను నా కోసం కాదు.. జట్టు కోసం ఆడతాను’ అని తెలిపాడు.

ప్లేయింగ్ XIపై మాట్లాడుతూ, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రం చేస్తాడని ప్రకటించాడు. శ్రేయాస్ అయ్యర్ భారత టెస్టు చరిత్రలో 303వ నంబర్ ఆటగాడిగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 2017లో పరిమిత ఓవర్లలో ఆరంభించాడు. అయితే టెస్టు క్రికెటర్ కల నెరవేరేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు కూడా ఉన్నాయి. దాని కారణంగా శ్రేయాస్ ఈ స్థాయికి చేరుకున్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్ నమ్మకాన్ని గెలుచున్నాడు..
అది దాదాపు రెండేళ్ల క్రితం మాట. పరిమిత ఓవర్లలో భారత జట్టులో నాలుగో ర్యాంక్‌పై పోరు కొనసాగుతోంది. నిజానికి ఈ సమస్య అంతకు ముందు కూడా ఉంది. కానీ, 2019 చివరి వరకు పరిష్కారం దొరకలేదు. అంతకుముందు 2019 ప్రపంచకప్‌లో కూడా ఈ సమస్య భారత జట్టుకు తలనొప్పిగా మారింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని శ్రేయాస్ అయ్యర్ గెలుచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 2017లోనే పరిమిత ఓవర్లలో అరంగేట్రం చేశాడు. 2018 వరకు కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో అయ్యర్‌కు మళ్లీ అవకాశం లభించింది.

శ్రేయాస్ అయ్యర్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో, అతను వెస్టిండీస్‌లో రెండు, హోమ్‌గ్రౌండ్‌లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ శ్రేయాస్ అయ్యర్‌పై విశ్వాసం ఉంచడం ప్రారంభించిన సమయం అది. శ్రేయాస్ అయ్యర్ గాయపడకపోతే, అతను జట్టులో కీలక ప్లేయర్‌గా మారేవాడు.

శ్రేయాస్ అయ్యర్ స్పెషాలిటీ..
శ్రేయాస్ అయ్యర్ ప్రతిరోజూ పరిణితి చెందుతూ, అంచలంచెలుగా రాణిస్తున్నాడు. ముంబై తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతను ఈ పరిపక్వతను నిరూపించుకున్నాడు. అతని ఖాతాలో 12 సెంచరీలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ సగటు 50కి పైగా ఉంది. కేవలం 24 ఏళ్ల వయస్సులో ఢిల్లీ సారథిగా మారి IPLలో తన సత్తా చాటాడు. అతని బ్యాటింగ్‌లోనూ సహజమైన దూకుడు కనిపిస్తుంది. పరిమిత ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్‌ను బట్టి ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. వన్డేల్లో అతని స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువగా ఉండగా, టీ20లో 130 కంటే ఎక్కువ. అందుకే నాచురల్ స్ట్రోక్ ప్లేయర్‌గా నిలిచాడు.

శ్రేయాస్ అయ్యర్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే అద్భుతమైన ఆటగాడు. స్పిన్నర్లపై కూడా అతని ఫుట్‌వర్క్ అద్భుతంగా ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ వికెట్‌కు రెండు వైపులా పరుగులు చేయడంలో నిపుణుడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు పునరాగమనం చేసిన తర్వాత మరోసారి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది నిజం. అయితే ఈ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ రాణిస్తే, టీమిండియాలో చోటు పదిలం చేసుకునే ఛాన్స్ ఉంది.

Also Read: ప్రాక్టీస్‌ కోసం 80 కి.మీ.ల దూరం.. ఇంగ్లండ్‌పై 10 వికెట్లతో సంచలనం.. ధోని నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్న భారత మహిళా పాస్ట్ బౌలర్..!

IND vs NZ 1st Test Preview, Playing XI: డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రతీకారానికి సిద్ధమైన భారత్.. నేటి నుంచి కాన్పూర్‌లో తొలిటెస్ట్