IND vs NZ 1st ODI Playing 11: శ్రేయాస్ ఔట్.. ఆ ఇద్దరు ఇన్.. హైదరాబాద్‌లో భారత్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..

|

Jan 18, 2023 | 7:00 AM

IND Vs NZ Match Prediction Squads: భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆయన స్థానంలో సూర్యకుమార్‌కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

IND vs NZ 1st ODI Playing 11: శ్రేయాస్ ఔట్.. ఆ ఇద్దరు ఇన్.. హైదరాబాద్‌లో భారత్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..
Team India Players
Follow us on

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తుఫాన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌పై కూర్చోవడం చూసి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల ఈ కోరిక న్యూజిలాండ్‌పై నెరవేరబోతోందని తెలుస్తోంది. వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇందులో సూర్యకుమార్ ఆడడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. న్యూజిలాండ్ నుంచి గట్టి సవాలును ఎదుర్కొనేందుకు భారత జట్టు బలమైన జట్టును రంగంలోకి దించాలనుకుంటోంది. ఈ ఏడాది ప్రపంచకప్‌ నుంచి భారత్‌కు ప్రతి వన్డే సిరీస్‌ ఎంతో కీలకం కానున్న సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లో, రెండో మ్యాచ్ రాయ్‌పూర్‌లో, మూడో మ్యాచ్ ఇండోర్‌లో జరగనుంది. మూడు మ్యాచ్‌ల్లోనూ సూర్యకుమార్‌కు అవకాశం దక్కవచ్చు. ప్రపంచకప్‌కు ముందు, వన్డే ఫార్మాట్‌లో నిలదొక్కుకోవడానికి సూర్యకు ఇంతకంటే మంచి అవకాశం లభించదు.

అయ్యర్ స్థానంలో సూర్యకు అవకాశం..

వన్డే సిరీస్ కోసం శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. అతని నిష్క్రమణ సూర్యకుమార్‌కు లాభదాయకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు సూర్య జట్టులోకి ప్రవేశించడం ఖాయంగా మారింది. వన్డేల్లో అతని రికార్డు అంతగా ఆకట్టుకోనప్పటికీ, గత రెండేళ్లలో టీ20లో సూర్య తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ ఆడాలని ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌ భావిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వన్డేల్లో సూర్య పేలవ రికార్డు..

శ్రీలంకతో చివరి వన్డేలో సూర్యకు అవకాశం కల్పించారు. ఆ మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 17 వన్డేల్లో 388 పరుగులు మాత్రమే చేశాడు. సూర్య తన రికార్డును మెరుగుపరుచుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. సూర్య, హార్దిక్ పాండ్యా ఉండటం భారత మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుస్తుంది.

మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్..

న్యూజిలాండ్‌తో ఓపెనింగ్ జోడీలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు . మిడిల్ ఆర్డర్‌లో మార్పు రావచ్చు. ఇషాన్ కిషన్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించవచ్చు. అతను మిడిల్ ఆర్డర్‌లో కనిపించవచ్చు. అక్షర్ పటేల్ గైర్హాజరీలో షహబాజ్ అహ్మద్ లేదా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వవచ్చు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/ షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్/ కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: టామ్ లాథమ్ (కెప్టెన్, కీపర్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, డగ్ బ్రాస్‌వెల్, లాకీ ఫెర్గూసన్, మైఖేల్ బ్రాస్‌వెల్, షిప్లీ, బ్లెయిర్ టిక్నర్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..