IND Vs ENG: సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లాండ్.. ప్రతీకారంతో కోహ్లీసేన.. తుది జట్టులో మార్పులు.?

|

Sep 02, 2021 | 8:09 AM

మొదటి టెస్ట్ గెలిచినంత పని చేసింది. రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. అయితే మూడో టెస్టులో మాత్రం సీన్ అంతా రివర్స్ అయింది.

IND Vs ENG: సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లాండ్.. ప్రతీకారంతో కోహ్లీసేన.. తుది జట్టులో మార్పులు.?
Ind Vs Eng
Follow us on

మొదటి టెస్ట్ గెలిచినంత పని చేసింది. రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. అయితే మూడో టెస్టులో మాత్రం సీన్ అంతా రివర్స్ అయింది. బలహీనతలు అధిగమించలేక కోహ్లీసేన బొక్కబోర్లాపడింది. పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. ఫలితంగా ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ నేపధ్యంలో ఇరు జట్లు కీలక పోరుకు సిద్దమయ్యాయి. నేటి నుంచి ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగో టెస్ట్ జరగనుంది. మూడో టెస్టు విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌పై కన్నేయగా.. బ్యాటింగ్ లోపాలను అధిగమించి ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా తహతహలాడుతోంది.

ఇదిలా ఉంటే.. బ్యాటింగ్ అంతంతమాత్రంగా ఉన్న టీమిండియా జట్టు తన తుది కూర్పును ఎలా ఎంచుకుంటుందో వేచి చూడాలి. పేలవ ఫామ్‌లో ఉన్న వైస్ కెప్టెన్ అజింక్య రహనేకు తుది జట్టులో చోటు ఉంటుందా.? లేదా కొత్త ఆటగాడికి ఛాన్స్ ఇస్తారా.? సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారి జట్టులో స్థానం కోసం ఆత్రంగా వేచి చూస్తున్నారు. టీమిండియా మిడిల్ ఆర్డర్ ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి. కోహ్లీ, రహనే ఫామ్ లేక సతమతమవుతున్నారు. గత మ్యాచ్‌లో పుజారా ఫామ్ అందుకోగా.. ఈ మ్యాచ్ ఎలా ఆడతాడో చూడాలి. అటు స్పిన్నర్లకు సహకరించే ఓవల్ పిచ్‌లో.. సీనియర్ ఆటగాడు అశ్విన్‌ను ఆడించే అవకాశం ఉంది. అటు ఇషాంత్ శర్మ స్థానంలో ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు. టీమిండియాను ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఆడితే మాత్రం.. రూట్-అశ్విన్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

టీమిండియా(అంచనా): కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్/శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్(అంచనా): రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), ఒల్లీ పోప్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్, సామ్ కర్రాన్, క్రెయిగ్ ఓవర్‌టన్, డేనియల్ లారెన్స్