Rounder Ravindra Jadeja: చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టు పరాజయం నుంచి బయటపడకముందే టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి రెండు టెస్టులకు అందుబాటులోఉండడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
గాయం కారణంగా మొదటి రెండు టెస్టులకు జడేజా దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడి గాయం ఇంకా మానకపోవడంతో.. వైద్యులు మరింత సమయం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరారట. దీనితో చివరి రెండు టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లోనూ జడేజా ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం జడేజా బెంగళూరు NCAలో చికిత్స తీసుకుంటున్న సంగతి విదితమే.