Ind vs Eng Live: కట్టడిలో ఇంగ్లాండ్.. భోజన విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి.. 39 పరుగులు

రెండో రోజు ఆటలో తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ 39 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో జారిపోయింది. టీమిండియా బౌలర్లు తిప్పేస్తుండటంతో

Ind vs Eng Live: కట్టడిలో ఇంగ్లాండ్.. భోజన విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి.. 39 పరుగులు
Cricket India vs England

Updated on: Feb 14, 2021 | 12:07 PM

India vs England Score: రెండో రోజు ఆటలో తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ 39 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో జారిపోయింది. టీమిండియా బౌలర్లు తిప్పేస్తుండటంతో ఇంగ్లాండ్ టీమ్ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. భోజన విరామానికి ముందు అశ్విన్‌ వేసిన ఓవర్‌లో‌ చివరి బంతికి లారెన్స్‌(9) ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం బెన్‌స్టోక్స్‌(8) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ ఇంకా 290 పరుగుల వెనుకంజలో నిలిచింది.

అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌పంత్‌ (58/ 77 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్సర్లతో వాలంటైన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 300/6తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ మరో 29 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండోరోజు తొలి ఓవర్‌లోనే మోయిన్‌ అలీ.. అక్షర్‌ పటేల్‌(5), ఇషాంత్‌(0)ను ఔట్‌ చేసి భారత్‌కు షాకిచ్చాడు.

అయితే, కుల్‌దీప్‌ కాసేపు బ్యాటింగ్‌ చేసిన పంత్‌ బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 65 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై స్టోన్‌ వేసిన 96వ ఓవర్‌లో కుల్‌దీప్‌, సిరాజ్‌(4) ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో రెండో తొలి సెషన్‌లోనే మొత్తం 8 వికెట్లు పడటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

Ind vs Eng: రెండో రోజు టీమిండియా బౌలర్ల దూకుడు.. కట్టడిలో ఇంగ్లాండ్..

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా మారిన ప్రభాస్ హీరోయిన్.. నెలకో సినిమా విడుదల చేస్తోన్న బ్యూటీ..