India vs England 2nd Test Engaland All Out: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ పరాజయం తర్వాత భారత్ రెండో టెస్ట్‌లో పుంజుకుంది. విజయమే లక్ష్యంగా చెన్నై వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి నుంచి దూకుడుతో దూసుకెళ్లింది. ఓ వైపు భారత బ్యాట్స్‌మెన్ 329 పరుగులతో రాణించగా.. బౌలర్లు కూడా రెచ్చిపోయారు.
భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. 59.5 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలింది. దీంతో భారత్ 195 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం రెండోొ టెస్టుపై టీమిండియా పట్టుబిగిస్తోంది. ఇక ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే.. బెన్ ఫోక్స్ ఒంటరి పోరాటం చేశాడు. 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సహచరులు అవుట్ అవుతున్నా.. చివరి వరకు నిలిచాడు. 107 బంతులను ఎదుర్కొన్న ఫోక్స్ 4 ఫోర్లు కొట్టాడు. ఇక భారత బౌలర్లలో .. అశ్విన్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక 195 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం క్రీజ్‌లో గిల్(10), రోహిత్ క్రీజ్ (13)లో ఉన్నారు.
Also Read: INDIA VS ENGLAND 2021: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏంటో తెలుసా..