India vs England : చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. టీ20 తరహాలో దూకుడుగా ఆడిన పంత్.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చుపించాడు. బ్యాక్ టు బ్యాక్ బౌడరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే 57వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు.
ఓ సమయంలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు దీపపు చుక్కానిలా మారాడు పంత్. వేగంగా ఆడుతూ ప్రత్యర్ధి జట్టులో వణుకు పుట్టించాడు. క్రీజులో కుదురుకున్న పంత్.. డామ్ బెస్ బౌలింగ్‌లో ఓ షాట్ కోసం యత్నించి వికెట్‌ను పారేసుకున్నాడు. రిషబ్ పంత్ 88 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో 9ఫోర్లతోపాటు 5సిక్సర్లు ఉన్నాయి. సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.
టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్లకు భిన్నంగా పంత్ చెన్నై స్టేడియంలో పరుగుల వరద పారించాడు. చివరి సెషన్‌లో అచ్చు టీ20 తరహాలో బ్యాట్‌తో దుకుడు ప్రదర్శించాడు. పుజారా, పంత్ మధ్య చక్కటి జోడీ కుదిరింది. స్పిన్నర్ డామ్ బెస్ బౌలింగ్‌లో పుజారా(73) కూడా అనూహ్యంగా ఔటయ్యాడు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 100కు పైగా పరుగులు అందించింది.
చివరి సెషన్‌లో పుజారా నిష్క్రమణతో పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో పంత్ వీరవిహారం చేశాడు. అతని బౌలింగ్‌లో అలవోకగా భారీ సిక్సర్లు కొట్టేశాడు. భారత ఇన్నింగ్స్‌లో నమోదైన ఐదు సిక్సర్లు పంత్ కొట్టడం విశేషం.
ఇవి కూడా చదవండి :
India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్ విరామానికి టీమిండియా స్కోర్ 59/2
Corona Cases Telangana : తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎంతంటే..!