India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్‌ విరామానికి టీమిండియా స్కోర్‌ 59/2

|

Feb 07, 2021 | 12:15 PM

చెన్నై స్టేడియంలో ఇంగ్లాండ్‌ జరుగుతున్న తొలి టెస్ట్‌ మొదటి సెషన్‌లోనే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగుల వద్ద ఓపెనర్‌ రోహిత్ శర్మ(6) ఔట్ అయ్యాడు. కొద్ది సేపటికే మరో దూకుడు..

India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్‌ విరామానికి టీమిండియా స్కోర్‌ 59/2
lunch break on Day 3 India are 59/2
Follow us on

India vs England : చెన్నై స్టేడియంలో ఇంగ్లాండ్‌ జరుగుతున్న తొలి టెస్ట్‌ మొదటి సెషన్‌లోనే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగుల వద్ద ఓపెనర్‌ రోహిత్ శర్మ(6) ఔట్ అయ్యాడు. కొద్ది సేపటికే మరో దూకుడు మీదున్న ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (29) భారీ షాట్‌ కోసం ప్రయత్నించి వెనుదిరిగాడు. దీంతో ఆదిలోనే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాగా అంతకుముందు పర్యటక ఇంగ్లాండ్‌ జట్టు 578 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆదివారం 555/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్‌లో రూట్‌ 218, సిబ్లీ 87, స్టోక్స్‌ 82 పరుగులు పోప్‌ 34, డొమినిక్‌ 34, బర్న్స్‌ 33, బట్లర్‌ 30 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌కు చెరో 3 వికెట్లు, ఇషాంత్, షాబాజ్‌ నదీమ్‌కు తలో 2 వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి :

India vs England : చెన్నై చెపక్ స్టేడియంలో టీమిండియా ముందు భారీ టార్గెట్.. ఆ ఇద్దరి మీదే ఫోకస్..