India vs England : టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడు మీదున్నారు. బ్యాట్స్‌మెన్ జోరూట్(156), బెన్‌స్టోక్స్(63) దూసుకుపోతున్నారు. 263/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ 119 ఓవర్లకు 355/3 స్కోర్ చేసింది. కాగా, రూట్‌కిది 100వ టెస్టు కావడం విశేషం. అయితే, ఇంతకుముందు శ్రీలంకతో ఆడిన 98, 99 టెస్టుల్లోనూ అతడు 150+ స్కోర్లు సాధించాడు. ఆ టెస్టుల్లో వరుసగా 228, 186 పరుగులు సాధించాడు. అదే జోరుతో ఇప్పుడు హ్యాట్రిక్ శతకంతో దూసుకుపోతున్నాడు.
ఇదిలావుంటే.. చెన్నై టెస్ట్ రెండో రోజు భారత్ వికెట్ల కోసం పోరాటం కొనసాగుతోంది. ఒక్క టీమిండియా బౌలర్ కూడా వికెట్ తీసుకోలేకపోయారు. అయితే, టీమిండియా వికెట్లు పడేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటకీ.. ఎలాంటి ఫలితం దక్కడం లేదు.
India vs England : దూకుడు మీదున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. లంచ్ విరామ సమయానికి స్కోరు..
Prabhas Radheshyam: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ దశాబ్దానికి అతిపెద్ద ప్రేమ ప్రకటన వచ్చేసింది