India vs England 1st T20 Live Score: టీమిండియాతో జరగనున్న ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా అహ్మదబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇదిలా ఉంటే టెస్ట్ మ్యాచ్‌లో కోలుకోని దెబ్బకొట్టిన భారత్‌ను ఓడించాలని ఇంగ్లాండ్ కసితో ఉంది. అలాగే టెస్ట్‌లాగే టీ20లోనూ విజయపరంపరంగా కొనసాగించాలని భారత్ చూస్తోంది.
ఇదిలా ఉంటే మ్యాచ్ ప్రారంభమయ్యే చివరి క్షణంలో రోహిత్ శర్మకు విరామం ప్రకటించారు. దీంతో చివరి క్షణంలో రోహిత్‌కు ఎందుకు విశ్రాంతి ఇచ్చారనే అనుమానం వస్తోంది. రోహిత్‌కు ఏమైనా గాయమయ్యిందా అనే కోణంలో కూడా విశ్లేషిస్తున్నారు. అయితే టాస్ తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. కొన్ని మ్యాచ్‌లకు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే ఐసిసి ర్యాంకింగ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రస్తుతం మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. కొంతకాలంగా ఇంగ్లాండ్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, భారత జట్టు ఇటీవల రెండో స్థానికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు ఈ సిరీస్ మొదటి స్థానంలోకి వెళ్లడానికి ఒక అవకాశంగా చెప్పవచ్చు. అయితే టీమిండియా ఈ సిరీస్‌ను 4-1 లేదా 4-0తో గెలిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, శ్రేయస్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలన్, బెయిర్‌స్టో, స్టోక్స్, సామ్ కరన్, జొర్డాన్, ఆర్చర్, మార్క్‌వుడ్, రషీద్.
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ను ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇచ్చిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సునాయాసంగా చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జట్టుకు శుభారంభం పలికారు. దీంతో ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్ల నష్టానికి 15.3 ఓవర్లలో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇంగ్లండ్ జట్టు తొలి టీ20 మ్యాచ్ విజయానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్ జట్టు విజయం సాధించడానికి కేవలం పది పరుగుల దూరంలో ఉంది. 34 బంతుల్లో ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ పది పరుగులు చేయాల్సి ఉంది.
ఇంగ్లండ్ జట్టు స్కోరును పరుగులు పెట్టించిన రాయ్ జోరుకు వాషింగ్టన్ సుందర్ బ్రేక్ వేశాడు. 32 బంతుల్లో 49 పరుగులు చేసిన రాయ్ సుందర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో కేవలం ఒక్క పరుగుతో రాయ్ హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.
ఇంగ్లండ్ ఓపెనర్లు ఇచ్చిన మంచి ఆరంభం జట్టుకు బాగా కలిసొచ్చింది. రాయ్, బట్లర్ నిలకడగా ఆడడంతో ఇంగ్లండ్ జోట్టు స్కోర్ మొదటి నుంచి పరుగులు పెట్టింది. ఇక పది ఓవర్ల పూర్తయ్యే సమయానికి ఇంగ్లండ్ జట్టు స్కోర్ పరుగుల వద్ద కొనసాగుతోంది. ఇంగ్లండ్ విజయానికి మరో 44 పరుగుల దూరంలో ఉంది.
ఎట్టకేలకు ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచి మంచి ఆటతీరును కనబరిచిన బట్లర్‌ను చహల్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు. ఇక తొలి వికెట్‌కు కీలకమైన 72 పరుగుల భాగస్వామ్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు అందించారు.
ఇంగ్లాండ్ ఓపెనర్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. నిలకడగా ఆడుతూ.. ఆరు ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 50 పరుగుల మార్కును దాటేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ ఏడు ఓవర్లకు 58 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఇంగ్లండ్ గెలుపొందడానికి 78 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది.
ఇంగ్లండ్ ఓపెనర్లు శుభారంభం పలికారు. నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు స్కోర్ 5 ఓవర్లకు ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 42 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఇక క్రీజులో బట్లర్ (18 ), రాయ్ (24) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
125 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడుతున్నారు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు స్కోరు 10 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో రాయ్ (14), బట్లర్ (2) ఉన్నారు.
టీమిండియా స్కోర్ నిలకడగా పెరుగుతోందనుకుంటున్న సమయంలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ మరోసారి చిక్కుల్లో పడింది. పాండ్యా అవుట్ అయిన కొద్ది సేపటికే శార్దుల్ క్యాచ్ అవుట్ రూపంలో వెనుతిరిగాడు.
భారత జట్టు స్కోరును పెంచుతూ మంచి భాగస్వామ్యాన్ని అందించిన శ్రేయస్, పాండ్యాల జోడిని ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ విడతీశాడు. 17.3 బంతి వద్ద ఆర్చర్ విసిరిన బంతికి షాట్ కొట్టిన పాండ్యాను మలన్ క్యాచ్ రూపంలో అవుట్ చేశాడు. దీంతో భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది.
తక్కువ పరుగుల తేడాతో వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ టీమిండియా స్కోర్ బోర్డు పెరగడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని అందించే క్రమంలో శ్రేయస్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 36 బంతుల్లో ఏడు ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 16.2 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 94 వద్ద కొనసాగుతోంది.
ఇంగ్లాండ్ పేసర్ల దాటికి ఆదిలోనే టీమిండియాకు భారీ దెగ్గ తగిలింది. తక్కువ పరుగుల తేడాతోనే వికెట్లు పడిపోవడంతో అది టీమిండియా స్కోర్‌పై ప్రభావం పడింది. ఇక నాలుగో వికెట్ తర్వాత క్రీజులో ఉన్న శ్రేయస్, పాండ్యా టీమిండియా స్కోర్‌ను పెంచే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే 33 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం అందించారు.
పది ఓవర్లకు టీమిండియా కేవలం 48 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టోక్స్ విసిరిన బంతిని రిషబ్ షాట్ కొట్టగా.. బెయిర్‌స్టో క్యాచ్ పట్టుకున్నాడు. ప్రస్తుతం 11 ఓవర్లకు భారత్ స్కోరు నాలుగు వికెట్లు కోల్పోయి 55 పరుగుల వద్ద కొనసాగుతోంది.
ఆర్చర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ రివర్స్‌స్వీప్‌లో కొట్టిన సిక్సర్‌పై ప్రశంసల జల్లుకురుస్తోంది. ఇంగ్లాండ్ వెటరన్ బ్యాట్స్‌మెన్ మాన్ కెవిన్ పీటర్సన్.. ‘ఈ షాట్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన షాట్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ కూడా అద్భుతమైన షాట్ అంటూ పొగడ్తలు కురిపించాడు.
Holy smokes!
Pant has just played the greatest shot that’s ever been played in cricket.
Reverse sweeping/lifting Archer with a brand new white ball at 90mph for 6.?
— Kevin Pietersen? (@KP24) March 12, 2021
What a incredible shot from @RishabhPant17 Looking forward to him bailing the team out this terrible situation just like he did in the last few Tests. #INDvENG pic.twitter.com/ggUfOqBU85
— VVS Laxman (@VVSLaxman281) March 12, 2021
తొలి టీ20 మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి దెబ్బతగిలింది. ఇంగ్లాండ్ పేసర్ల దాటికి భారత బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ దారి పట్టారు. కేవలం 6 ఓవర్లలోనే రాహుల్, కోహ్లి, ధవన్ అవుటయ్యారు. ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.
టీమిండియా మరో వికెట్‌ను కోల్పోయింది. 4.6 ఓవర్ వద్ద మార్క్ వుడ్ విసిరిన బంతికి శిఖార్ ధవన్ బౌల్డ్ అయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 20/3గా ఉంది. ప్రస్తుతం టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇక ఐదో ఓవర్‌లో మార్క్ వుడ్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీయడం విశేషం.
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఈ టీ20 చాలా ముఖ్యమైందిగతా చెప్పవచ్చు. యుజ్వేంద్ర చాహల్‌కు ఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. చాహల్ ఇప్పటి వరకు 54 వన్డేలు ఆడగా ఇది 46వ టీ20 మ్యాచ్.
Congratulations & best wishes to @yuzi_chahal who will be playing his 1⃣0⃣0⃣th international game today. ??@Paytm #INDvENG #TeamIndia pic.twitter.com/iTSr6cNfC0
— BCCI (@BCCI) March 12, 2021
తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ వెనువెంటనే వికెట్లను కోల్పోతోంది. తాజాగా ఆదిల్ వేసిన బంతికి విరాట్ కోహ్లి అవుట్ అయ్యాడు. విరాట్ కొట్టిన బంతిని లాంగాఫ్‌లో ఉన్న బోర్డాన్ సులువుగా క్యాచ్ పట్టుకున్నాడు. కేవలం 14 బంతుల్లోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.
☝️ KL Rahul
☝️ Virat KohliIndia have lost two big wickets inside the first three overs. A dream start for England ?#INDvENG | https://t.co/c6nwSdBr8j pic.twitter.com/AFsHlPn69O
— ICC (@ICC) March 12, 2021
తొలి టీ20 ప్రారంభమైన కాసేపటికే టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు రెండు పరుగులు ఉన్న సమయంలో కేఎల్ రాహుల్ జోఫ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్.. ఒక వికెట్ నష్టానికి 2 పరుగులు వద్ద కొనసాగుతోంది.