IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లా మూడో వన్డే‌ వేదికలో కీలక మార్పు.. ఎందుకంటే?

|

Nov 23, 2022 | 5:53 PM

డిసెంబర్ 4 నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. మూడో మ్యాచ్ ఢాకాలో జరగాల్సి ఉంది. అయితే, తాజాగా ఈ వన్డే వేదికను మార్చాల్సి వచ్చింది.q

IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లా మూడో వన్డే‌ వేదికలో కీలక మార్పు.. ఎందుకంటే?
Team India
Follow us on

ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు టీ20 సిరీస్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శుక్రవారం నుంచి వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ పర్యటన తర్వాత భారత జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ టూర్‌కు ముందే ఓ పెద్ద వార్త తెరపైకి వచ్చింది. నిజానికి , భారత్ , బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ మూడో మ్యాచ్ లో కీలక మార్పు చోటు చేసుకుంది . మూడో వన్డే వేదికను మార్చారు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో వన్డే ఢాకాలో జరగాల్సి ఉండగా ఇప్పుడు ఈ మ్యాచ్ చిట్టగాంగ్‌లో జరగనుంది. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్‌తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. మూడో వన్డే డిసెంబర్ 10న ఢాకాలో జరగాల్సి ఉండగా, అదే రోజు నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ నిరసనను ప్రకటించింది. అదే రోజు ర్యాలీని కూడా నిర్వహించనుంది. నిరసనలు, బెదిరింపుల మధ్య, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ వేదికను మార్చింది.

తొలి మూడు వన్డేలు ఢాకాలోనే జరగాల్సి ఉంది..

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ మధ్య వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఢాకాలో జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు చివరి మ్యాచ్ చిట్టగాంగ్‌లో జరగనుంది. దీంతో పాటు ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ కూడా నిర్వహించనున్నారు. సిరీస్‌లో రెండో టెస్టు ఢాకా వేదికగా జరగనుంది. డిసెంబర్ 14 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

వన్డే సిరీస్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్.

టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్.

జట్టులో మార్పులు ఉండవచ్చు..

కాగా, ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ స్వ్కాడ్‌లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. బంగ్లాదేశ్ టూర్ వరకు రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం కష్టమని తెలుస్తోంది. దీంతో ఇతర ఆటగాళ్లకు అవకాశం కల్పించవచ్చని వార్తలు వస్తున్నాయి . ఆసియా కప్‌లో జడేజా కాలికి గాయమైన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..