INDW vs AUSW: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?

India Women vs Australia Women, 18th Match: భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. మహిళల T-20 ప్రపంచకప్ 2024లో సెమీ-ఫైనల్ రేసులో నిలవాలంటే భారత మహిళల జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. ఈ క్రమంలో ఇప్పుడే టాస్ పడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

INDW vs AUSW: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
India Women Vs Australia Women, 18th Match

Updated on: Oct 13, 2024 | 7:20 PM

India Women vs Australia Women, 18th Match: భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. మహిళల T-20 ప్రపంచకప్ 2024లో సెమీ-ఫైనల్ రేసులో నిలవాలంటే భారత మహిళల జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. ఈ క్రమంలో ఇప్పుడే టాస్ పడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌తో పాటు టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. టీ20 ప్రపంచకప్‌ను 6 సార్లు గెలుచుకుంది.

మహిళల టీ20 క్రికెట్‌లోనూ, ప్రపంచకప్‌లోనూ భారత్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 4, భారత్ 2 గెలిచాయి. ఆస్ట్రేలియా గెలిచిన 4 మ్యాచ్‌లలో 3 నాకౌట్ మ్యాచ్‌లు (2010 సెమీ-ఫైనల్, 2020 ఫైనల్, 2023 సెమీ-ఫైనల్) ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): బెత్ మూనీ(కీపర్), గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్(కెప్టెన్), జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..