Prime Ministers XI vs India, 2-day Warm-up Match: డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. దీనికి ముందు, భారత జట్టు కాన్‌బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. మొదటి రోజు వర్షంతో రద్దుకాగా.. రెండో రోజు హర్షిత్ రాణాను చూసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ వణికిపోయారు. తొలిరోజు ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రెండో రోజు 50-50 ఓవర్ల మ్యాచ్‌లో ఇరు జట్లు మైదానంలోకి దిగాయి.
ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మరోసారి వర్షం అంతరాయం కలగడంతో ఓవర్లను 46-46 ఓవర్లకు కుదించారు. వర్షం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత రానా విధ్వంసం సృష్టించాడు. 6 బంతుల్లోనే నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ఫేట్ మార్చేశాడు. ఈ క్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.
Harshit Rana on fire 🔥 🔥 🔥 🔥 #harshitrana #BorderGavaskarTrophypic.twitter.com/3w0R6C1fRN
— Mufaddal Vohra (parody) (@MufaddalVohraz) December 1, 2024
ప్రైమ్ మినిస్టర్స్ XI: సామ్ కాన్స్టాస్, మాట్ రెన్‌షా, జేడెన్ గుడ్‌విన్, జాక్ క్లేటన్, ఆలివర్ డేవిస్, జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), సామ్ హార్పర్ (wk), ఐడాన్ ఓ’కానర్, హన్నో జాకబ్స్, మహ్లీ బార్డ్‌మాన్, చార్లీ ఆండర్సన్, స్కాట్ బోలాండ్, లాయిడ్ పోప్ , జాక్ నిస్బెట్.
భారత్: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, దేవదత్ పాడిక్కల్ , అభిమన్యు ఈశ్వరన్, ఆర్ అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..