
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో భారత్ ఫీల్డింగ్ చేయనుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌లో ఇరు జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి. టాస్ అనంతరం ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాయి. అశ్విన్ భారత ప్లేయింగ్ XI నుంచి తప్పించారు. భారత జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజాకు స్పిన్నర్‌గా అవకాశం లభించగా, రవిచంద్రన్ అశ్విన్‌కు బెంచ్‌లోనే ఉంచారు.
అంతకుముందు, బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతులకు నివాళులు అర్పించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో నివాళులర్పించారు.
ఓవల్‌లో ఆస్ట్రేలియాకు ఇది 39వ టెస్టు. ఇంతకు ముందు ఆడిన 38 టెస్టు మ్యాచ్‌ల్లో ఇక్కడ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అదే సమయంలో ఈ మైదానంలో భారత జట్టుకి ఇది 15వ టెస్టు. ఇంతకు ముందు ఆడిన 14 టెస్టుల్లో ఇక్కడ 5 టెస్టుల్లో విజయం సాధించింది.
జట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.