IND vs AUS 2nd T20I: హాఫ్ సెంచరీలతో దంచి కొట్టిన ఇషాన్, జైస్వాల్, రుతురాజ్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..

|

Nov 26, 2023 | 8:58 PM

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియాకు 236 పరుగుల లక్ష్యాన్ని అందించింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

IND vs AUS 2nd T20I: హాఫ్ సెంచరీలతో దంచి కొట్టిన ఇషాన్, జైస్వాల్, రుతురాజ్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..
Ind Vs Aus T20i Score
Follow us on

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియాకు 236 పరుగుల లక్ష్యాన్ని అందించింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

భారత్ తరఫున యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

పవర్ ప్లేలో దుంచికొట్టిన ఓపెనర్లు..

తొలి 2 ఓవర్లలో యశస్వి జైస్వాల్, రితురాజ్ గైక్వాడ్ జోడీ జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుంది. ఆ తర్వాత మూడో ఓవర్‌లో ఇద్దరూ వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. గ్లెన్ మాక్స్‌వెల్ వేసిన తొలి ఓవర్‌లో ఈ జోడీ 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్ కు వచ్చిన షాన్ అబాట్ ఒకే ఓవర్లో 5 బౌండరీలు బాది స్కోరు 50 దాటించారు. ఈ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. అబాట్ వేసిన ఓవర్లో భారత ఓపెనర్లు 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.

పవర్‌ప్లే చివరి ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు. 53 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. జైస్వాల్ తన టీ20 కెరీర్‌లో 25 బంతుల్లో రెండో ఫిఫ్టీని పూర్తి చేశాడు. గైక్వాడ్‌తో కలిసి 35 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యాన్ని నాథన్ ఎల్లిస్ విచ్ఛిన్నం చేశాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11 ఇదే..

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు ముఖేష్ కుమార్.

ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్/వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, షాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..