IND vs AUS 2nd T20I Cricket Highlights: రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం.. సిరీస్‌లో ముందంజ..

|

Nov 26, 2023 | 10:54 PM

India vs Australia 2nd T20I Cricket Match Result: టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇది వరుసగా నాలుగో విజయం. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో మూడో మ్యాచ్ నవంబర్ 28న గౌహతిలో జరగనుంది.

IND vs AUS 2nd T20I Cricket Highlights: రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం.. సిరీస్‌లో ముందంజ..
Ind Vs Aus 2nd T20i Recport
Follow us on

India vs Australia 2nd T20I Cricket Match Result: టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇది వరుసగా నాలుగో విజయం. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో మూడో మ్యాచ్ నవంబర్ 28న గౌహతిలో జరగనుంది.

తిరువనంతపురంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. దీంతో కంగారూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయ

ఇవి కూడా చదవండి

ఆడమ్ జంపా ఒక్క పరుగు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

నాథన్ ఎల్లిస్ 1 పరుగు చేసి కృష్ణ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కృష్ణకు ఇది మూడో వికెట్. షాన్ అబాట్ (1 పరుగు), స్టీవ్ స్మిత్ (19 పరుగులు)లను కూడా అవుట్ చేశాడు.

మార్కస్ స్టోయినిస్ 45 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంతకుముందు టిమ్ డేవిడ్ (37 పరుగులు), జోస్ ఇంగ్లిస్ (2 పరుగులు), మాథ్యూ షార్ట్ (19 పరుగులు)లను రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (12 పరుగులు) అక్షర్ పటేల్‌ బౌలింగ‌లో పెవిలియన్ చేరాడు.

236 పరుగుల లక్ష్యం ఇచ్చిన టీమ్ ఇండియా..

తిరువనంతపురంలో తొలుత బ్యాటింగ్ చేసిన జైస్వాల్, కిషన్, గైక్వాడ్‌లతో కూడిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. భారత జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 53 పరుగులు, ఇషాన్ కిషన్ 52 పరుగులు, రీతురాజ్ గైక్వాడ్ 58 పరుగులు చేశారు.

ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీశాడు. మార్కస్ స్టోయినిస్‌కు ఒక వికెట్ దక్కింది.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్(w/c), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..