India vs Australia: టి-20లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం..

India vs Australia: మొహాలీ టి-20లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. భారత్‌ స్కోర్‌..

India vs Australia: టి-20లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం..
India Vs Australia

Updated on: Sep 20, 2022 | 11:23 PM

India vs Australia: మొహాలీ టి-20లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. భారత్‌ స్కోర్‌ 208/6, ఆస్ట్రేలియా స్కోర్‌ 211/6. అయితే ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు భారీ స్కోర్‌ చేసింది. హార్తిక్‌ పాండ్య (71 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌ -55తో చెలరేగిపోయాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (46) రాణించాడు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఎలిస్‌ మూడు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ ఓవర్లలో వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఇక ఆస్ట్రేలియా జట్టులో గ్రీన్‌(61), స్టీవెన్‌ స్మిత్‌(35), వేడ్‌(45 నాటౌట్‌) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో మ్యాచ్‌ అక్టోబర్ 23 నాగ్‌పుర్‌ వేదికగా జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి