India vs Afghanistan, T20 World Cup 2024: భారత్ తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీ-20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అజేయంగా ఉంది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫిఫ్టీ (53 పరుగులు) సాయంతో స్లో పిచ్‌పై టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసి 182 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘన్ జట్టుకు అందించింది.
పరుగుల ఛేదనలో ఆఫ్ఘన్ జట్టు 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెరో 3 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు అందుకున్నాడు. అక్షర్-జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది. ఆఫ్ఘన్ జట్టులో అజ్మతుల్లా ఓమ్జాయ్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు.
A 47-run victory in Barbados 🥳🏖️#TeamIndia kick off their Super 8 stage with a brilliant win against Afghanistan 👏👏
📸 ICC
Scorecard ▶️ https://t.co/xtWkPFaJhD#T20WorldCup | #AFGvIND pic.twitter.com/qG8F3XJWeZ
— BCCI (@BCCI) June 20, 2024
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫరూజ్కాల్హాక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..