
ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్ బాల్‌తో కంటే ముందు బ్యాట్‌తో చిన్న పాటి విధ్వంసం సృష్టించాడు. ఇన్సింగ్స్ డిక్లేర్ చేయడానికి కొద్ది సేపు ముందు క్రీజ్‌లోకి వచ్చిన సిరాజ్.. టీమ్ స్కోర్ వీలైనంత ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో అల్ట్రా అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేశాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు చేసి.. టీమ్‌కు వ్యాల్యూబుల్ రన్స్ అందించాడు.
సిరాజ్ ఆడిన ఈ ఇన్సింగ్స్‌లో మరో విశేషం ఏమిటంటే.. అతని స్ట్రైక్ రేట్. ఏకంగా 183.33 స్ట్రైక్ రేట్‌తో సిరాజ్ బ్యాటింగ్ చేశాడు. టీమిండియా ఇన్సింగ్స్‌లో మిగతా అందరికంటే సిరాజ్ స్ట్రైక్ రేటే ఎక్కువ. పైగా ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్, 81 రన్స్‌తో రాణించిన సాయి సుదర్శన్ సైతం ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయారు. కానీ మియా భాయ్ మాత్రం ఓ భారీ సిక్సర్‌తో అందరిని షాక్‌కు గురి చేశాడు. అది కూడా మామూలు సిక్స్ కాదు.. మంచి టైమింగ్, టెక్నిక్‌తో సూపర్‌గా కొట్టాడు. సిరాజ్ బ్యాటింగ్ చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న భారత క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.
Just look at the Mohammed Siraj reaction after hitting six 😂😭pic.twitter.com/mn18kDAfDw
— Cricket Central (@CricketCentrl) June 7, 2026
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్సింగ్స్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 177 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 126, కేఎల్ రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్లతో 100 పరుగులు చేసి సెంచరీలతో కదం తొక్కారు. అలాగే సాయి సుదర్శన్ 81, రిషభ్ పంత్ 81 వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేసి రాణించారు. తర్వాత తొలి ఇన్సింగ్స్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్ ఆడుతున్న మానవ్ సుతార్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ప్రస్తుతం ఆఫ్ఘాన్ 98 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. సుతార్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి