U19 World Cup: బెంగళూరు చేరుకున్న భారత అండర్-19 జట్టు.. ఘన స్వాగతం పలికిన అభిమానులు..

|

Feb 08, 2022 | 1:37 PM

వెస్టిండీస్‌లో ఐదో అండర్ 19 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. జట్టు సభ్యులు మంగళవారం ఉదయం బెంగళూరు చేరుకున్నారు...

U19 World Cup: బెంగళూరు చేరుకున్న భారత అండర్-19 జట్టు.. ఘన స్వాగతం పలికిన అభిమానులు..
Under 19
Follow us on

వెస్టిండీస్‌లో ఐదో అండర్ 19 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. జట్టు సభ్యులు మంగళవారం ఉదయం బెంగళూరు చేరుకున్నారు. వారికి ఘన స్వాగతం లభించింది. అంతకుముందు వారు ఆమ్‌స్టర్‌డామ్, దుబాయ్‌లో వారు ఆగారు. బుధవారం జరిగే బీసీసీఐ సన్మాన వేడుక కోసం ఆటగాళ్లు మంగళవారం అహ్మదాబాద్‌కు వెళ్తారు. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో యష్ ధుల్ నేతృత్వంలోని భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 5వ సారి ట్రోఫీని కైవసం చేసుకున్నారు.

ఫైనల్లో 190 పరుగుల లక్ష్యాన్ని ఇండియా మరో 2 బంతులు మిగిలి ఉండగా చేధించింది. భారత్‌ బ్యాటింగ్‌లో నిషాంత్‌ సింధు 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ 50 పరుగులు చేశాడు. రాజ్‌ బవా 35 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ సేల్స్‌, బోయ్‌డెన్‌, అస్పిన్‌వాల్‌ తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టీమిండియా పేసర్లు రాజ్‌ బవా(5/31), రవికుమార్‌(4/34)ల ధాటికి ఇంగ్లండ్‌ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. బ్యాటర్‌ జేమ్స్‌ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన ఆటతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు.

Read Also.. IPL 2022 వేలానికి ముందు తుఫాన్‌ సెంచరీ.. 57 బంతుల్లో 116 పరుగులు.. ఎవరో తెలుసా..?