Vaibhav Suryavanshi : కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ.. అంపైర్‌తో మైదానంలోనే గొడవ.. అసలు ఏం జరిగిందంటే?

భారత అండర్-19 క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే, మెకేలో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రం అతని బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. కేవలం 14 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటైన వైభవ్ ఆ తరువాత భయంకరమైన కోపంతో అంపైర్‌తో మైదానంలోనే గొడవకు దిగడం ఆసక్తికరంగా మారింది.

Vaibhav Suryavanshi : కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ.. అంపైర్‌తో మైదానంలోనే గొడవ.. అసలు ఏం జరిగిందంటే?
Vaibhav Suryavanshi

Updated on: Oct 07, 2025 | 4:51 PM

Vaibhav Suryavanshi : భారత అండర్-19 క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే, మెకేలో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రం అతని బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. కేవలం 14 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటైన ఈ ఆటగాడు, ఆ తరువాత భయంకరమైన కోపంతో అంపైర్‌తో మైదానంలోనే గొడవకు దిగడం ఆసక్తికరంగా మారింది. తనపై ఇచ్చిన ఔట్ నిర్ణయం పట్ల వైభవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానం నుంచి బయటకు వెళ్లే ముందు కూడా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతున్నాడు. సాధారణంగా ఓపెనింగ్ చేసే ఈ ఆటగాడిని, ఈ మ్యాచ్‌లో నంబర్ 3 స్థానంలో పంపారు. బ్యాటింగ్‌కు రాగానే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. కానీ, 7వ ఓవర్‌లో చార్లెస్ లచ్మండ్ వేసిన బంతిని వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ క్యాచ్ పట్టడంతో అంపైర్ వెంటనే ఔట్‌గా ప్రకటించాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు. బంతి తన బ్యాట్‌కు కాకుండా థై-ప్యాడ్‌కు తగిలిందని, అది ఔట్ కాదని అంపైర్‌తో వాదించాడు.

ఔటైన తర్వాత కూడా వైభవ్ సూర్యవంశీ పిచ్ వద్దే నిలబడి కనిపించాడు. అతను అంపైర్‌తో ఏదో గట్టిగా చెబుతున్నట్లు కనిపించింది. తరువాత, ఫెవిలియన్‌కు తిరిగి వెళ్లే ముందు కూడా మళ్లీ అంపైర్‌తో వేడి వేడిగా వాదించాడు. నాన్-స్ట్రైక్‌లో ఉన్న వేదాంత్ త్రివేది కూడా అంపైర్‌కు ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అంపైర్ తన వేలిని పైకి ఎత్తడంతో, వైభవ్ సూర్యవంశీ మైదానాన్ని వీడక తప్పలేదు. సాధారణంగా అవుట్ అయిన తర్వాత తలదించుకుని వెళ్లే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, ఇంత కోపంగా కనిపించడం ఇదే మొదటిసారి.

ఈ సంఘటనతో పాటు, మరో ప్రశ్న కూడా తెర మీదకు వచ్చింది. భారత అండర్-19 టీమ్ మేనేజ్‌మెంట్ వైభవ్ సూర్యవంశీని ఓపెనింగ్ నుంచి ఎందుకు తొలగించింది? గతేడాది ఓపెనింగ్ స్థానంలో విధ్వంసం సృష్టిస్తున్న బ్యాట్స్‌మెన్‌ను ఫస్ట్-డౌన్‌‎లో ఎందుకు పంపారు? ఈ నిర్ణయం వల్ల వైభవ్‌తో పాటు జట్టుకు కూడా నష్టం జరిగింది. ఈ నిర్ణయంపై మరిన్ని విమర్శలకు దారి తీసింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..