Asia Cup U-19 : బుడ్డోడికి బంపర్ ఆఫర్..అండర్-19 ఆసియా కప్‎లో చోటు..కెప్టెన్‌గా 17 ఏళ్ల స్టార్

భారత క్రికెట్ భవిష్యత్తుకు పునాది వేసే టోర్నమెంట్లలో ఒకటైన అండర్-19 ఆసియా కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. యువ క్రికెట్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న, 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్‌లో జరగనున్న ఈ వన్డే టోర్నమెంట్, వచ్చే ఏడాది జరగబోయే అండర్-19 ప్రపంచకప్‌కు సన్నాహకంగా కూడా ఉపయోగపడుతుంది.

Asia Cup U-19 : బుడ్డోడికి బంపర్ ఆఫర్..అండర్-19 ఆసియా కప్‎లో చోటు..కెప్టెన్‌గా 17 ఏళ్ల స్టార్
Vaibhav Suryavanshi

Updated on: Nov 28, 2025 | 1:31 PM

Asia Cup U-19 : భారత క్రికెట్ భవిష్యత్తుకు పునాది వేసే టోర్నమెంట్లలో ఒకటైన అండర్-19 ఆసియా కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. యువ క్రికెట్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న, 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్‌లో జరగనున్న ఈ వన్డే టోర్నమెంట్, వచ్చే ఏడాది జరగబోయే అండర్-19 ప్రపంచకప్‌కు సన్నాహకంగా కూడా ఉపయోగపడుతుంది. అయితే జట్టులో అత్యంత ఆకర్షణ అయిన వైభవ్ సూర్యవంశీకి కాకుండా, 17 ఏళ్ల మరో యువ ఆటగాడికి కెప్టెన్సీ దక్కింది.

బీసీసీఐ నవంబర్ 28, శుక్రవారం నాడు అండర్-19 ఆసియా కప్ 2025 కోసం భారత స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌కు 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా, నలుగురిని స్టాండ్‌బైగా సెలక్ట్ చేశారు. ఈ జట్టులో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.

అయితే జట్టు పగ్గాలను 14 ఏళ్ల వైభవ్‌కు కాకుండా, జట్టులో సీనియర్‌గా ఉన్న 17 ఏళ్ల ఆయుష్ మాత్రేకు అప్పగించారు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్ పర్యటనలో కూడా ఆయుష్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను విహాన్ మల్హోత్రాకు అప్పగించారు.

ఈ స్క్వాడ్‌లో అత్యంత ముఖ్యమైన ఆటగాడు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. గతంలో ఆసియా కప్ రైజింగ్ స్టార్ లాంటి టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇప్పుడు అండర్-19 ఆసియా కప్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. వైభవ్ ఈ టోర్నమెంట్‌లో కూడా ఓపెనర్‌గా బాధ్యతలు తీసుకుని, జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు.

గత ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్.. మెన్స్ యూత్ వన్డేలలో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్, ఆసియా కప్‌లోనూ అలాంటి అద్భుతాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భారత అండర్-19 స్క్వాడ్

ఆయుష్ మాత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా(వైస్-కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండూ (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్, యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ ఎ పటేల్, నమన్ పుష్పక్, డి దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉద్ధవ్ మోహన్ , ఐరాన్ జార్జ్, రాహుల్ కుమార్, హేమ్‌చుదేశన్ జె, బికె కిషోర్, ఆదిత్య రావత్.

భారత్ షెడ్యూల్, ప్రత్యర్థులు

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్థాన్‌లు గ్రూప్ Aలో ఉన్నాయి.

గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, రెండు క్వాలిఫైయర్ జట్లు.

గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒక క్వాలిఫైయర్ జట్టు.

టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్:

డిసెంబర్ 12: భారత్ vs క్వాలిఫైయర్ 1

డిసెంబర్ 14: భారత్ vs పాకిస్థాన్

డిసెంబర్ 16: భారత్ vs క్వాలిఫైయర్ 3

డిసెంబర్ 19: సెమీ-ఫైనల్స్

డిసెంబర్ 21: ఫైనల్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..