IND vs SL 1st Test: 6+3+2 వ్యూహంతో బరిలోకి.. ఆ ఇద్దరు ఔట్.. తొలి టెస్ట్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..?

India vs Sri Lanka 1st TesIND sv Playing XI: సన్నాహక మ్యాచ్ ద్వారా లంక వాతావరణానికి అలవాటుపడిన భారత జట్టు గాలే టెస్టుకు పూర్తి సన్నద్ధమైంది. సమతుల్యంగా ఉన్న ఈ ప్లేయింగ్ 11 లంక మైదానంలో విజయం సాధించి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది.

IND vs SL 1st Test: 6+3+2 వ్యూహంతో బరిలోకి.. ఆ ఇద్దరు ఔట్.. తొలి టెస్ట్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..?
Ind Vs Sl 1st Test Playing 11

Updated on: Aug 10, 2026 | 7:54 AM

India vs Sri Lanka 1st Test Playing XI: ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే కీలకమైన తొలి టెస్టు కోసం భారత అత్యుత్తమ తుది జట్టు సిద్ధమైంది. సన్నాహక మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు కూర్పును విశ్లేషకులు సిద్ధం చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవడానికి శ్రీలంకను ఓడించడం భారత్‌కు ఎంతో ముఖ్యం.

శ్రీలంకతో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్‌ లో రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. సన్నాహక మ్యాచ్‌లో వీరిద్దరూ మంచి పరుగులతో మెరిశారు. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడటానికి ఇష్టపడితే, రాహుల్ లంక బౌలర్ల ధాటిని తట్టుకుని సుదీర్ఘ సమయం క్రీజులో నిలబడగలడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవడంతో మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ అవకాశం దక్కించుకున్నాడు. సన్నాహక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ సూపర్ సెంచరీతో మెరిసి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ఇవి కూడా చదవండి

మిడిల్ ఆర్డర్ బాధ్యత కెప్టెన్ గిల్ చేతుల్లో..

చిన్నపాటి గాయం నుంచి కోలుకున్న భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐదో స్థానంలో తుఫాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రానున్నాడు. సన్నాహక పోరులో విఫలమైనప్పటికీ పంత్ ఎల్లప్పుడూ లంక బౌలర్లకు పెద్ద ముప్పుగా మారగలడు. ఆరో స్థానంలో ధ్రువ్ జురెల్ మ్యాచ్ ఫినిషర్‌గా నిలవనున్నాడు.

ఆల్‌రౌండర్ల బలం.. జడేజా నుంచి సుథార్ వరకు..

గామింగ్ కండిషన్స్ దృష్ట్యా లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ లోతు ఉండాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. గడిచిన కాలంలో జడేజా బ్యాటింగ్‌లో స్థిరమైన ప్రదర్శన ఇస్తూ జట్టుకు వెన్నుముకగా మారాడు. ఎనిమిదో స్థానంలో ఆల్‌రౌండర్‌గా మానవ్ సుథార్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి సగటు ఉన్న సుథార్, దిగువ వరుసలో అవసరమైన పరుగులు రాబట్టగలడు.

ఎక్కువమంది చదివింది: టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే మొనగాళ్లు.. ఒక్క ఓవర్‌లోనే బీభత్సం.. మనోడి రికార్డ్ బద్దలవ్వడం కష్టమే

స్పిన్ మంత్రం.. బౌలింగ్ విభాగం సమర్థత..

గాచ్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. జడేజా, సుథార్‌లతో పాటు ప్రధాన స్పిన్నర్‌గా కుల్‌దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నాడు. శ్రీలంకలో కుల్‌దీప్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక వేగవంతమైన బౌలింగ్ బాధ్యతలను మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మోయనున్నారు. సన్నాహక మ్యాచ్‌లో వీరిద్దరూ సత్తా చాటి జట్టులో స్థానాలు ఖాయం చేసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us