
CK Nayudu Cup Triple Century: క్రికెట్ హిస్టరీలో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీ రికార్డులు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. ఒకప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు తమ సత్తా చాటగా.. ఇప్పుడు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి బ్యాటర్స్ తుఫాను బ్యాటింగ్‌తో బౌలర్లను భయపెడుతున్నారు. అయితే, దేశవాళీ క్రికెట్‌లోనూ కొత్తగా ఎంతోమంది సత్తా చాటుతూ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో 23 ఏళ్ల ప్లేయర్ ట్రిపుల్ సెంచరీతో దడదడ పుట్టించాడు. ఈ ట్రిపుల్ సెంచరీ ప్లేయర్ ఏమయ్యాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ బ్యాట్స్ మెన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. అసలు ఎవరీ ప్లేయర్, అసలెందుకు చర్చనీయాంశంగా మారాడు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో సంచలనం సృష్టించిన కర్ణాటక యువ ఓపెనర్ మెక్‌నీల్ నొరోన్హా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గత ఏడాది త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో నొరోన్హా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కర్ణాటక జట్టు ఆధిక్యం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ ఓపెనర్ విధ్వంసం తొలి ఇన్నింగ్స్‌లో వచ్చింది. దీంతో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 580 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం త్రిపుర జట్టు కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. 7గురు బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించిన శశికుమార్ బౌలింగ్‌లో సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లో మెక్‌నీల్ నొరోన్హా ట్రిపుల్ సెంచరీ చేయడం విశేషం. ఈ 23 ఏళ్ల బ్యాటర్ 25 సిక్సర్లు కొట్టి 150 పరుగులు పిండుకున్నాడు. అలాగే, ఈ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు కూడా బాదేశాడు. మొత్తంగా 99.14 స్ట్రైక్ రేట్‌తో 348 బంతుల్లో 345 పరుగులతో చెలరేగిపోయాడు. 335 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.

కాగా, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో సత్తా చాటుతున్నారు. ఇదే క్రమంలో నొరోన్హా ట్రిపుల్ సెంచరీపైనా ఆ సమయంలో తీవ్రంగా చర్చ జరిగింది. కాగా, ఈ ప్లేయర్ 2025లో పేలవ ఫాంతో సతమతమయ్యాడు. మహారాజా ట్రోఫీ KSCA T20లో సత్తా చాటుతున్నాడు. కానీ, భారీ ఇన్నింగ్స్ ఆడడంలో మాత్రం విఫలమయ్యాడు.