India Pakistan Match: నేడు భారత్ పాకిస్థాన్ మ్యాచ్..10 సెకన్లలో రూ. 30 లక్షలు సంపాదిస్తున్న డిస్నీ హాట్‌స్టార్.. ఎలాఅంటే..

|

Oct 14, 2023 | 8:15 AM

దేశ విదేశాల్లో ఉన్న దాదాపు 150 కోట్లమంది భారతీయులు ఉత్సాహంగా క్రికెట్ మ్యాచ్ ను వీక్షించడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ఓటిటీ యాప్ డిస్నీ హాట్ స్టార్ ఈ మ్యాచ్ తో భారీ ప్రయోజనం పొందుతుంది. ఈ మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న డిస్నీ-హాట్ స్టార్ కేవలం ప్రకటనల ద్వారా రూ. 150 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లో సాధించిన సంపాదన కంటే దాదాపు రూ.50 కోట్లు ఎక్కువ

India Pakistan Match: నేడు భారత్ పాకిస్థాన్ మ్యాచ్..10 సెకన్లలో రూ. 30 లక్షలు సంపాదిస్తున్న డిస్నీ హాట్‌స్టార్.. ఎలాఅంటే..
India Pakistan Match
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు నేడు పండగ రోజు..  అవును.. క్రికెట్ ప్రేమికులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ప్రపంచంలోనే అతి ఇంట్రెస్టింగ్ క్రికెట్ మ్యాచ్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ ను  దాదాపు 1.50 లక్షల మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. దేశ విదేశాల్లో ఉన్న దాదాపు 150 కోట్లమంది భారతీయులు ఉత్సాహంగా క్రికెట్ మ్యాచ్ ను వీక్షించడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ఓటిటీ యాప్ డిస్నీ హాట్ స్టార్ ఈ మ్యాచ్ తో భారీ ప్రయోజనం పొందుతుంది. ఈ మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న డిస్నీ-హాట్ స్టార్ కేవలం ప్రకటనల ద్వారా రూ. 150 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లో సాధించిన సంపాదన కంటే దాదాపు రూ.50 కోట్లు ఎక్కువ.  డిస్నీ స్టార్ ఈ మ్యాచ్ ద్వారా ఇన్ని కోట్లు బిజినెస్ ను ఎలా చేస్తుందో తెలుసుకుందాం..

 రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

మీడియా నివేదికల ప్రకారం, 2019 వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో డిస్నీ-హాట్‌స్టార్ 10 యాడ్ స్లాట్‌లకు రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది. ఆ మ్యాచ్‌లో మొత్తం యాడ్ స్లాట్ 5500 సెకన్లు. అంటే స్టార్ యాడ్ స్లాట్‌లను విక్రయించడం ద్వారా డిస్నీ రూ.100 కోట్లకు పైగా ఆర్జించిందని ఒక అంచనా. అప్పుడు జరిగిన ప్రపంచ కప్‌లో ఇతర జట్లతో భారత్‌ తలపడే మ్యాచ్‌ల్లో ప్రకటనల కోసం డిస్నీ స్టార్ 10 సెకన్లకు రూ. 16 నుంచి 18 లక్షలు తీసుకుంది. అయితే భారత్ పాకిస్తాన్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కు మరింత ప్రాధాన్యత..ఆదరణ ఉంటుంది. ఏ విధంగా తలపడిన సరే ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన మ్యాచ్ ఇదే అవుతుంది.

ఈసారి రూ.150 కోట్ల వసూలు

ఈసారి డిస్నీ హాట్‌స్టార్ .. భారత్ .. పాక్ ల మధ్య మ్యాచ్ ద్వారా రూ. 150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదన ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మీడియా నివేదికల నుండి అందిన సమాచారం ప్రకారం ఈసారి భారత్ పాకిస్తాన్ మ్యాచ్‌ను క్యాష్ చేసుకోవడానికి డిస్నీ స్టార్ ప్రకటన స్లాట్‌లను పెంచడానికి సిద్ధంగా ఉంది. 10 సెకనుల స్లాట్‌కు రూ. 30 నుండి 35 లక్షలను వసూలు చేస్తుందని తెలుస్తోంది. 2019 సంవత్సరంలో లాగా 5500 సెకండ్ యాడ్ స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయని భావించినట్లయితే.. డిస్నీ హాట్ స్టార్ రూ. 150 కోట్ల కంటే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. ఇది 2019 సంవత్సరంతో పోలిస్తే రూ. 50 కోట్లకు పైగా లాభం పొందుతుందని ఆ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ టోర్నీ ద్వారా రూ.1000 వేల కోట్లు సంపాదించాలని ప్లాన్

నిపుణుల చెప్పిన లెక్కల ప్రకారం.. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ ద్వారా బ్రాడ్‌కాస్టర్లు సుమారు రూ. 1,000 కోట్లు సంపాదించాలని యోచిస్తున్నాయి. సమాచారం ప్రకారం 2019 సంవత్సరంలో 10 సెకన్ల స్లాట్ తుది ధర రూ. 6 నుండి 7 లక్షలు. అయితే ఈ సారి మ్యాచ్ లో స్లాట్ ధర.. 10 సెకన్ల స్లాట్ అయితే రూ.10,25,000 గా అంచనా వేస్తున్నారు. క్రికెట్ ప్రపంచ కప్ లో జరిగే మ్యాచ్ మ్యాచ్ కు ఉత్కంఠ పెరుగుతుండడంతో.. అందరి దృష్టి విక్రయదారులు, స్పాన్సర్లపై ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులపై ప్రభావం చూపిస్తూ ఈ టోర్నమెంట్ ను ఎవరు ఎలా ఉపయోగించుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..