India-Pakistan match: OTT లో ఇండియా-పాక్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

|

Jan 13, 2025 | 9:14 PM

నెట్‌ఫ్లిక్స్ ఫిబ్రవరి 7న "ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్" అనే డాక్యుమెంటరీ విడుదల చేస్తోంది. ఇది భారత్-పాక్ క్రికెట్ రైవల్రీకి సంబంధించిన చిరస్మరణీయ సంఘటనలను చూపించనుంది. సెహ్వాగ్, గంగూలీ, షోయబ్ వంటి దిగ్గజాలు ఇందులో కనిపించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ డాక్యుమెంటరీ క్రికెట్ అభిమానులకు సర్‌ప్రైజ్ కానుంది.

India-Pakistan match: OTT లో ఇండియా-పాక్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ind Vs Pak
Follow us on

భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులకు నిజమైన ఉత్కంఠ. వీరి మ్యాచ్‌ గురించి ఎన్నో కథలు, చిరస్మరణీయ సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రైవల్రీపై ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదలకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. “ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్” పేరుతో ఫిబ్రవరి 7న ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

డాక్యుమెంటరీ పోస్టర్‌లో సచిన్, సెహ్వాగ్ పాక్ జట్టుతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించడమే క్రికెట్ అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. ఇందులో సెహ్వాగ్, గంగూలీ, షోయబ్ అక్తర్, వాకర్ యూనిస్ వంటి దిగ్గజాలతో పాటు ఇంజమాన్ ఉల్ హక్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్ల ప్రసంగాలు కూడా ఉండనున్నాయి.

గతంలో భారత్-పాక్ మ్యాచ్‌ల ఉత్కంఠ భరిత మూమెంట్స్, ఇరువురి రైవల్రీ ఎలా మారింది అనే ఆసక్తికర విషయాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. “రెండు దేశాల మధ్య అద్భుత పోటీ, 160 కోట్ల మంది ఆశలు, భారత్-పాక్ క్రికెట్ అనుభవాన్ని మరింత ఆస్వాదించండి” అంటూ నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది.

అయితే ఇటు ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్ మొదలుకానుండటంతో, భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుండటంతో ఈ డాక్యుమెంటరీ క్రికెట్ ప్రేమికులకు అసలు ట్రీట్ గా మారనుంది.