Ramiz Raja: టీ20 వరల్డ్ కప్‌లో ఆ మూడు జట్లు పాక్ టార్గెట్.. PCB ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు

|

Sep 21, 2021 | 3:38 PM

భద్రతా కారణాలతో పాక్‌లో క్రికెట్ టోర్నీల నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు వైదొలగడంపై పాక్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. అవమాన భారంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఓ రకంగా ఆ రెండు జట్లపై దూషణలకు దిగుతున్నారు.

Ramiz Raja: టీ20 వరల్డ్ కప్‌లో ఆ మూడు జట్లు పాక్ టార్గెట్.. PCB ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు
Ramiz Raja
Follow us on

భద్రతా కారణాలతో పాక్‌లో క్రికెట్ టోర్నీల నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు వైదొలగడంపై పాక్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. ఓ రకంగా ఆ రెండు జట్లపై దూషణల పర్వానికి తెరదీశారు. అటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ECB) తీసుకున్న నిర్ణయాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇంగ్లాండ్ జట్టు పాక్ పర్యటనను రద్దు చేసకోవడం తీవ్ర నిరాశకు గురిచేసినట్లు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఇలా జరుగుతుందని ముందే ఊహించినట్లు చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశాలు ఏకమయిపోతాయని.. పరస్పరం సహకరించుకుంటాయని వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అందరూ ఒకటేనని తాము భావించామని.. అయితే వారు మాత్రం మరోలా ఆలోచించారని ధ్వజమెత్తారు.

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు తమ స్వార్థం చూసుకున్నాయని.. పాక్ క్రికెట్ బోర్డుకు ఇది ఓ కనువిప్పుగా రమీజ్ రాజా పేర్కొన్నారు. ఇకపై పాక్ క్రికెట్ బోర్డు తన స్వార్థాన్ని చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. న్యూజిలాండ్ జట్టు కారణం చెప్పకుండానే పాక్ టోర్నీ నుంచి వైదొలగిందని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

టీ20 వరల్డ్ కప్‌లో పాక్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు తమ పొరుగుదేశం భారత్ మాత్రమే తమ టార్గెట్‌గా ఉండేదని.. ఇప్పుడు మరో రెండు జట్లు తమ టార్గెట్‌గా చేరాయని చెప్పారు. ఇకపై భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ కూడా తమ టార్గెట్‌గా ఉంటుందని స్పష్టంచేశారు. టీ20 వరల్డ్ కప్‌ సందర్భంలో క్రీడా మైదానంలో ప్రతీకారం తీర్చుకుంటామని రమీజ్ రాజా చెప్పుకొచ్చారు.

Also Read..

Viral Pics: నది ఒడ్డున సేద తీరుతున్న మొసలి.. చిరుత మెరుపు దాడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Raviteja: ఆ సినిమా సీక్వెల్ చేయడానికి రవితేజ అందుకే దూరంగా ఉంటున్నాడా ? నెట్టింట్లో సరికొత్త గాసిప్స్..